• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి’

SRPT: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించాలని కోదాడ పట్టణ సీఐ రాము అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు 35, ఆటోలు 33 పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఆటోలలో పరిమితి మించి ప్రయాణికులని నడపొద్దని సౌండ్ సిస్టం ఉండొద్దని అన్నారు.

December 25, 2024 / 07:02 PM IST

CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ADB: భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన ప్రమీలకి మంజూరు అయిన రూ. 42,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ బుధవారం అందజేశారు. ఆరోగ్య ఖర్చులరీత్యా అయిన వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.

December 25, 2024 / 06:59 PM IST

మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలు

KNR: శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధిలో ఆదర్శవంతమైన పాలన అందించిన మహనీయుడు అటల్ జీ అని కొనియాడారు.

December 25, 2024 / 06:52 PM IST

ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్

NRML: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిర్మల్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జానారెడ్డి, రాంబాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో వారిని ఎన్నుకున్నట్లు తెలిపారు.

December 25, 2024 / 06:48 PM IST

కోడి పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

ఖమ్మం: బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. పదివేల నగదు, ఆరుగురు వ్యక్తులు, ఆరు బైకులు, నాలుగు కోళ్లను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

December 25, 2024 / 06:47 PM IST

’26న జిల్లా క్రీడాకారులు రిపోర్టు చేయాలి’

MNCL: ఈ నెల 27 నుండి జరగనున్న సీఎం కప్- 2024 తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు 26న ఉదయం 9 గంటలకు మంచిర్యాలలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో రిపోర్ట్ చేయాలని డీవైఎస్ఓ కీర్తి రాజవీరు తెలిపారు. జూడో, కబడ్డీ, వాలీబాల్, కిక్ బాక్సింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, తదితర క్రీడాంశాలలో ఎంపికైన వారు హాజరు కావాలని సూచించారు.

December 25, 2024 / 06:47 PM IST

అయ్యప్ప స్వామి పడిపూజలో ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండపై బుధవారం జరిగిన పడిపూజ వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దేవాలయ 27వ వార్షికోత్సవం విశేషాలను తెలుసుకున్నారు. అయ్యప్ప స్వాములు ఆశీర్వాదం తీసుకుని వారిని పవిత్ర శబరిమలకు పంపుతూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

December 25, 2024 / 06:42 PM IST

‘బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలి రావాలి’

WGL: ఈ నెల 27న స్టేషన్ ఘనపూర్‌లో సీపీఎం జిల్లా మూడో మహాసభల సందర్భంగా నిర్వహించబోయే బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు అన్నారు. సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఎం పార్టీకి ప్రజలు అండగా ఉండాలన్నారు.

December 25, 2024 / 06:35 PM IST

‘ABVP చేసిన సేవలు వెలకట్టలేనివి’

MDK: కరోనా కాలంలో ABVP చేసిన సేవలు అమూల్యమైనవని నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ చీఫ్ అడ్వైజర్ ప్రజ్ఞా పరాండే అన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్షేత్రంలో పనిచేస్తునంత సేపు విద్యార్థి పరిషత్ భావజాలాన్ని విద్యార్థి నాయకులలో పెంచుతూ జాతి పునర్నిర్మాణానికి పాటుపడాలని సూచించారు.

December 25, 2024 / 06:35 PM IST

క్రిస్మస్ వేడుకలు.. ముస్లిం సోదరుడు అన్నదానం

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని శాశ్వత కృప ప్రార్థనా మందిరంలో మతసామరస్యం వెల్లివిరిసింది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ముస్లిం సోదరుడు సల్మాన్ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సల్మాన్‌ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ పాల్, మంజుల తదితరులున్నారు.

December 25, 2024 / 06:33 PM IST

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దు: ఎస్పీ

NRPT: పెరిగిన అధునాతన టెక్నాలజీ వాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని వారి ఉచ్చులో పడి ప్రజలు మోస పోవద్దని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం అన్నారు. లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోవద్దని, ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు తెరవకూడదని సూచించారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ఇవ్వకూడదన్నారు.

December 25, 2024 / 06:33 PM IST

సీఎంకు చిత్రపటం అందజేసిన యూత్ నాయకులు

MDK: మెదక్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి యూత్ కాంగ్రెస్ నాయకులు మెమొంటోను అందజేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోవాకు తరుణ్, నర్సాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చర్ల సందీప్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ముదిరాజ్, నర్సాపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి ఆయన చిత్రపటాన్ని అందజేశారు.

December 25, 2024 / 06:31 PM IST

సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

NLG: నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటీసీ వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్ మారగోని నవీన్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

December 25, 2024 / 06:30 PM IST

అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్

JGL: భీమారం మండలం మన్నెగూడం గ్రామంలో పల్లె గుట్టపై నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావుతో, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు.

December 25, 2024 / 06:29 PM IST

సీఎంతో కలిసి మంత్రి సురేఖ పూజలు

WGL: దుర్గభవాని మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ నెంబర్ వన్ స్థానంలో నిలవాలని కోరుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. మెదక్ పర్యటనలో భాగంగా ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్‌తో కలసి మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు.

December 25, 2024 / 06:13 PM IST