WGL: ఈ నెల 27న స్టేషన్ ఘనపూర్లో సీపీఎం జిల్లా మూడో మహాసభల సందర్భంగా నిర్వహించబోయే బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు అన్నారు. సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఎం పార్టీకి ప్రజలు అండగా ఉండాలన్నారు.