NLG: నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటీసీ వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్ మారగోని నవీన్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.