NLG: Febలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేలు పిక్స్డ్ వేతనం నిర్ణయించాలని PF, ESI ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ MLA జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా Dec 15-30వ తేదీ నిర్వహించే బస్సు జాత నల్గొండకి చేరుకోవడంతో బతుకమ్మలు, బోనాలతో ఆశ వర్కర్లు ఘన స్వాగతం పలికారు.
HYD: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని కేంద్రమంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు. శిబిరంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
NZB: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెర్కిట్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన రూపాంతర చర్చిలో జరిగిన వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం సర్వ మతాల సమ్మేళనమని అన్నారు.
WGL: రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు మంత్రి కొండా సురేఖ ఘన స్వాగతం పలికారు. అనంతరం కాసేపు పలు అంశాలపై ఉప రాష్ట్రపతితో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
NZB: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. 15 రోజులుగా కొనసాగుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని బుధవారం రూరల్ ఎమ్మెల్యే సందర్శించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి భూపేందర్, కోశాధికారి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ ఉన్నారు.
MDK: క్రిస్టియన్ సోదరుల పవిత్ర పండగ అయిన క్రిస్మస్ను పురస్కరించుకొని మనోహరాబాద్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్‌లో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మేడోజి బ్రహ్మచారి రాగి ఆకుపై ఏసుక్రీస్తు చిత్రపటాన్ని చిత్రించారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని రాగి ఆకుపై ఏసుక్రీస్తు చిత్రపటాన్ని చిత్రించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
HYD: ప్రజలు సమస్యలను చెప్పుకునేందుకు MIM పార్టీ కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
HYD: ప్రజలు సమస్యలను చెప్పుకునేందుకు MIM పార్టీ కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
BHPL: మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతిని ఘనంగా నిర్వహించారు. వాజ్‌పేయి చిత్రపటానికి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలు మరువలేనివని, వాజపేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
HYD: బోయిన్ పల్లి సీవీఆర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఎంతో గొప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కార్పొరేటర్ తిరుపతి యాదవ్, మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, ఆరెపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
HYD: వాజ్ పేయి జీవితం అందరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఖైరతాబాద్‌లో పార్టీ నేత మానేకర్ చంద్రు బాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి నవయుగ హృదయ సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్నారని చెప్పారు.
మెదక్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ… ఆసియా ఖండంలోని ప్రసిద్ధిగాంచిన చర్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం అందజేశారు. పుప్పల త్రిశూలకు రూ.39 వేలు, మంగలి రాచమ్మకు రూ.33 వేలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోటగిరి సుదర్శన్, పాల్గొన్నారు.
WNP: శ్రీరంగాపూర్ లోని అంబేడ్కర్ కాలనీలో ఇండ్ల మధ్యలో ఏపుగా పెరిగిన కంప చెట్లతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజును ఆదేశించగా జేసీబీ సాయంతో ఇండ్ల మధ్య కంపచెట్లను తొలగించారు. కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
BDK: ఇల్లందులోని విట్టల్ రావు భవన్లో కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం పార్థివ దేహానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మృతి ప్రజా, రైతు ఉద్యమాలకు తీరని లోటన్నారు. బ్రహ్మం ఆశయాల సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.