KMR: క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే క్రిస్మస్ పండుగ ప్రతి ఇంట్లో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ యేసు చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే చెప్పారు.
మెదక్: పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని, రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఐ చర్చ్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళిత క్రిస్టియన్, మైనార్టీలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
NLG: గుడిపల్లి మండల కేంద్రంలో DVK RTC డిపో ఆధ్వర్యంలో మన ఊరి గుడిపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులను జారీ చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దివ్యాంగులు పాసుల కోసం DVK డిపోకు వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని వారి సౌకర్యార్థం దివ్యాంగులకు మండల కేంద్రంలో పాసులు జారీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
NLG: APGVB పేరును 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారుస్తున్నట్లు బీబీనగర్ బ్రాంచ్ మేనేజర్ శంకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పలు రకాల గ్రామీణ బ్యాంకులన్నింటిని కలుపుతూ ఆయా రాష్ట్రాల పేర్లపై గ్రామీణ బ్యాంకులుగా మార్చిందని ఆయన అన్నారు. దీంతో DEC 28-31 వరకు సేవలు నిలిచిపోతాయని తెలిపారు.
HYD: RTC MD సజ్జనార్ కొత్త సైబర్ మోసాలపై ప్రజలను అలర్ట్ చేశారు. నేరగాళ్లు పిల్లలు ప్రమాదానికి గురయ్యారని తల్లిదండ్రులను మోసం చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. లింకుల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండి అనుమానాస్పద కాల్స్, లింకులను నమ్మవద్దని సూచించారు. కాగా కొంతకాలంగా ఇలాంటి వాటిపై సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.
ఆదిలాబాద్: దళిత బస్తీ పలువురు లబ్ధిదారులకు రూ. 3 లక్షల విలువ గల సీఆర్ఐ మోటార్స్ పంప్స్, స్టార్టర్ బోర్డు పరికరాలను బుధవారం తాంసి మండలం పొన్నారి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు పంపిణీ చేసినట్లు మాజీ వైస్ ఎంపీపీ మచ్చ రేఖ రఘు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేద దళితులకు మూడెకరాల భూమి అందించడం జరిగిందన్నారు.
ఖమ్మం: కూసుమంచి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ముత్యాలగూడెంలో కరెంట్ షాక్‌తో తాటికొండ రామారావు అనే రైతు మృతి చెందాడు. వ్యవసాయ పనులు నిమిత్తం పొలానికి వెళ్లి విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
MDK: మెదక్‌లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను పూర్తిగా తగ్గించింది. కేవలం డీలక్స్ బస్సులను స్పెషల్ బస్సులు అంటూ నడిపిస్తుంది. అంతే కాకుండా నార్మల్ చార్జీల కంటే టికెట్లు ధరలను రెండు రెట్లు పెంచి నడుపుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
PDPL: జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
HNK: భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుస్మృతినీ దగ్ధం చేశారు. ఈ రోజుతో 97 సంవత్సరాలు గడిచిపోయాయని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు హనుమకొండ రామ్ నగర్లోని కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగం, మనుస్మృతి అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రపంచ మేధావి అయినా అంబేద్కర్ సమాజంలోని అధిక సంఖ్యాకులకు హక్కుల కోసం పోరాటం చేశారన్నారు.
NZB: నవీపేట్‌లోని రైల్వే ప్రధాన గేటు మరమ్మతుల కోసం 26-12-24 నుంచి 30-12-24 వరకు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిజామాబాద్ వెళ్లే వాహనదారులు కమలాపూర్, మొకంపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. బాసర వెళ్లేవారు కల్యాపూర్, సాఠాపూర్, ఫకీరాబాద్ మీదుగా వెళ్లాలన్నారు.
నిర్మల్: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఉట్నూర్ పట్టణంతో పాటు దంతన్‌పల్లి చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్ని కులాలు, మతాల వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
KNR: తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. వంట వార్పు కార్యక్రమంతో ఉద్యోగులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తమ నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు.
NZB: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు టూ టౌన్ ఎస్ఐ యాసిన్ అరాఫత్ బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి దారుగల్లీలో టూ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఇబ్రహీం, జావిద్, మోసిన్, జియోదిన్, అమిరోద్దీన్, షబ్బీర్లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.17838 నగదును స్వాధీనం చేసుకున్నారు.