NRML: బీజేపీ నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వాజ్‌పేయి జీవిత చరిత్ర ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంజి కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా వాజ్‌పేయి దేశానికి చేసిన అభివృద్ధిని కొనియాడారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం దర్శనం కోసం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను సీఎంకు అందజేశారు. అంతకు ముందు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా జరిగింది.
PDPL: టీబీ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీబీ చికిత్స సీనియర్ పర్యవేక్షకులు దేవ తిరుపతి తెలిపారు. బుధవారం పెద్దపల్లి మండలం రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నిమ్మనపల్లిలో ప్రభుత్వం నిక్షయ్ శిబిర్ 100 రోజుల పథకంలో భాగంగా టీబీ శిబిరాన్ని నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ప్రధాని వాజ్ పేయి శత జయంతి వేడుకలను బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ జెండా కట్ట వద్ద బీజేపీ నాయకులు ఎం.రాజు, క్యామ భాస్కర్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.
BDK: భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజా సంఘాల స్వయం గౌరవ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మనుస్మృతి దహన్ దిన్ సందర్భంగా మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించిన అహింస ఉద్యమంలో డిసెంబర్ 25 భారతదేశంలో ఒక చారిత్రాత్మక ఘటన అని పేర్కొన్నారు.
ఆదిలాబాద్: నార్నూర్ మండల కేంద్రంలో వివిధ సంఘాల నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేడ్కర్ చిత్రపటాలతో నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు కోరి తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
వరంగల్: వర్ధన్నపేట మండలంలో నూతన సంవత్సరం వేడుకలకు డిజేలు పెట్టవద్దని, డీజేలు పెట్టి వేడుకలు చేస్తే కేసులు తప్పవని ఎస్సై చందర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం వేడుకల పేరుతో ఏలాంటి డీజేలు పెట్టినా.. మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంక్ వెనకాల వేంకటేశ్వర హాస్పిటల్ అండ్ క్రిటికల్ కేర్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ కుమార్, డాక్టర్ హరిప్రియలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. హాస్పిటల్ ప్రారంభం అనంతరం బీపీ చెకప్ చేసుకున్నారు.
KMM: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కామేపల్లి మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన బ్రహ్మం పార్టీవదేహాన్ని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి రాకేష్ సందర్శించి నివాళులర్పించారు. బ్రహ్మం అకాల మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
HNK: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి వేడుకలు బుధవారం బీజేపీ శ్రేణులు వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు, 64 వ డివిజన్ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
MDK: జాతీయ ఆహార భద్రత మిషన్- మొక్కజొన్న పథకంలో రాయితీపై మండలంలోని రైతులకు బయో సీడ్ 9544 హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి యు.వసంతరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో పత్తి సాగు చేసిన కొంతమంది రైతులు పత్తి పంట అనంతరం మొక్కజొన్న పంటను విత్తనున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కొత్తూరు(సి) గ్రామానికి చెందిన ఉబ్బెపల్లి సుకన్య (24) ఇవాళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన ఉబ్బపెల్లి గణేష్‌తో మూడేళ్ల కింద వివాహం జరిగింది. కాపురం సాఫీగా సాగుతుండగా ఆకస్మికంగా సుకన్య ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
KMR: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించారు. పోలింగ్‌కు అవసరమైన సిబ్బందిని CPO రాజారాం, బ్యాలెట్ పెట్టెల నిర్వహణను DRDO సురేందర్, ఎన్నికల అధికారుల శిక్షణ DEO రాజు ఆధ్వర్యంలో జరగనుంది. ఎన్నికల సామగ్రి నిర్వహణకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతిని నియమించారు. ఎన్నికల ఖర్చుల నిర్వహణ జిల్లా ఆడిట్ అధికారి కిషన్ పరిశీలిస్తారు.
KMR: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించారు. పోలింగ్‌కు అవసరమైన సిబ్బందిని CPO రాజారాం, బ్యాలెట్ పెట్టెల నిర్వహణను DRDO సురేందర్, ఎన్నికల అధికారుల శిక్షణ DEO రాజు ఆధ్వర్యంలో జరగనుంది. ఎన్నికల సామగ్రి నిర్వహణకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతిని నియమించారు. ఎన్నికల ఖర్చుల నిర్వహణ జిల్లా ఆడిట్ అధికారి కిషన్ పరిశీలిస్తారు.