SDPT: సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమం బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. తమను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
KMR: శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు రాజంపేట మండలము పొందుర్తి గ్రామ బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్ధాగత మార్పుల్లో భాగంగా 154 బూత్ అధ్యక్షుడిగా రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
JGL: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా పట్టణంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద బుధవారం భారత్ సురక్ష సమితి నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, అక్కినపెళ్ళి కాశీనాథo, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో పాపగారి ఇందిరా w/o కీ.శే ఎల్లయ్య కుమార్తె భవాని వివాహానికి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మినుకురి బ్రహ్మానందరెడ్డి పుస్తేమెట్టెలను బుధవారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఆడపిల్ల పెళ్లి కి పుస్తె మట్టెలు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
KMM: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు బుధవారం ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ సహచర పార్టీ నాయకులతో కలిసి వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సీనియర్ నాయకులు గెంటల విద్యాసాగర్‌ను సన్మానించారు. వాజ్ పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఆదిలాబాద్: దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొద్దు అన్నారు. బుధవారం కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామంలో హనుమాన్ మందిర్ ప్రారంభం, విగ్రహ ప్రతిష్టాపనలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఉన్నారు.
NRPT: యేసు ప్రభువు చూపించిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని అన్నారు. క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నెల స్వరూపతో పాటు ఆదర్శ యూత్ సభ్యులు ఉన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని 13వ వార్డు గొల్లబండ తాండాలో బుధవారం మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పర్యటించారు. మురుగునీటి కాలువలను, రోడ్లను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని పునర్నిర్మాణం చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
WNP: ప్రజా శ్రేయస్సు కోసం, దేశం కోసం పనిచేసిన వ్యక్తి మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి అని బీజేపీ వనపర్తి పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. దివంగత అటల్ బిహారీ వాజ్ పేయ్ 100వ జయంతిని బుధవారం వనపర్తి పట్టణంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
HYD: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేకంగా MMTS రైళ్లు నడపనున్నట్లు SCR సీపీఆర్డీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి తదితర ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు.
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కి వరుసగా 2 రోజుల సెలవులు నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా, గురువారం బాక్సింగ్ డే నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు మార్కెట్ సెక్రటరీ నిర్మల తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 2 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి శుక్రవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
ఖమ్మం: ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతా దేవి అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 26న జరిగే సీపీఐ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై ఉద్యమించే సీపీఐ పార్టీనే అని అన్నారు.
WNP: వనపర్తిలో అయ్యప్ప స్వామిని, ఆభరణాలను స్వాములు బుధవారం ఘనంగా ఊరేగించారు. అయ్యప్ప స్వాములు, భక్తులు స్వామివారిని, ఆభరణాలను జిల్లా కేంద్రంలోని రామాలయ మందిరం వద్ద ప్రారంభించి, అయ్యప్ప స్వామి దేవాలయం వరకు పల్లకిపై మోస్తూ స్వామివారిని ఆభరణాలను ఘనంగా ఊరేగించారు. పూజారులు, స్వామివారు, ప్రముఖులు, భక్తులు, స్థానికులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
MDK: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను ముందస్తుగా అరెస్టు చేసి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు గత పక్షం రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా, మెదక్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.