• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాజీ ఎంపీని పరామర్శించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్: మాజీ ఎంపీ మంద జగన్నాథంను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. మంద జగన్నాథం అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన కుమారుడు శ్రీనాథ్‌ను పలకరించి ధైర్యం చెప్పారు.

December 25, 2024 / 01:46 PM IST

సీఎంకు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

MDK: పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్య క్రమంలో ఆయాశాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

December 25, 2024 / 01:46 PM IST

జర్నలిస్ట్ కుమారుడిని పరామర్శించిన ప్రభుత్వ విప్

JGL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దేవి రాజమల్లయ్య చిన్నకుమారుడు సిద్ధార్థ రోడ్డు ప్రమాదంలో గాయపడగా, కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న MLA లక్ష్మణ్ కుమార్ బుధవారం ఆసుపత్రికి వెళ్లి సిద్ధార్థను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి అతడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

December 25, 2024 / 01:45 PM IST

కోయిల్ సాగర్ నుండి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్: దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ జలాశయం నుండి కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు యాసంగి పంటలకు సాగునీటిని బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీయంఆర్ మాట్లాడుతూ.. గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తీసుకుని వచ్చి అదనపు ఆయకట్టుకు చాలా గ్రామాల రైతులకు సాగునీటిని అందించనున్నామన్నారు.

December 25, 2024 / 01:45 PM IST

మెదక్ చర్చికి చేరుకున్న సీఎం రేవంత్

MDK: జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎస్సై చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా సీఎస్సై చర్చి 100 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సీఎస్సై చర్చి ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు సీఎస్సై నిర్వాకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొంటారు.

December 25, 2024 / 01:43 PM IST

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె టెంట్ ఎత్తివేత

MDK: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా సమ్మె చేస్తుండగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు టెంట్ తొలగించారు. సీఎం పర్యటన భద్రతా కారణాల పేర్లు చెప్పి దౌర్జన్యంగా సమ్మె చేస్తున్న టెంటు శిబిరాన్ని తొలగించడంపై మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు ఖండించారు.

December 25, 2024 / 01:41 PM IST

‘ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకం’

JGL: ఏసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మార్గదర్శకత్వమని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ప్రపంచానికి బోధించిన శాంతి దూత ఏసు అని అన్నారు.

December 25, 2024 / 01:40 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపిక

JGL: ఈనెల 15 నుండి 22 వరకు జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి అండర్ 17 తైక్వాండో పోటీలలో ధరూర్ క్యాంప్‌హై స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహేష్ శ్రీరాం సిద్ధం గోల్డ్ మెడల్ సాధించి ఈనెల 27 నుండి జనవరి 5 వరకు హైదరాబాదులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాసిత్, ఉపాధ్యాయులు అభినందించారు.

December 25, 2024 / 01:38 PM IST

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

SDPT: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికీ 16వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ (సెలవు దినం)రోజున కూడా జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాల మహిళా ఉద్యోగులు సమ్మెలో కూర్చున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను ప్రభుత్వం విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

December 25, 2024 / 01:35 PM IST

కురుమూర్తి స్వామి దర్శించుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే

మహబూబ్ నగర్: దేవరకద్ర నియోజకవర్గం శ్రీ కురుమూర్తి స్వామిని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ బుధవారం అయ్యప్ప మాలలో అయ్యప్ప స్వాముల బృందంతో కలిసి కురుమూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

December 25, 2024 / 01:31 PM IST

‘సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి’

ADB: గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

December 25, 2024 / 01:25 PM IST

‘సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి’

ADB: గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

December 25, 2024 / 01:25 PM IST

బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

NRML: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి అని అన్నారు.

December 25, 2024 / 01:24 PM IST

బచ్చోడును మండలంగా ఏర్పాటు చేయాలని వినతి

ఖమ్మం: బచ్చోడును మండలంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు యాదగిరి, రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసి, 18 గ్రామ పంచాయతీల తీర్మానాలను సమర్పించారు. తిరుమలాయపాలెం మండల కేంద్రం దూరంగా ఉండడంతో బచ్చోడును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.

December 25, 2024 / 01:22 PM IST

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో క్రిస్మస్ వేడుకలు

HYD: క్రిస్మస్ పండుగ సందర్భంగా అగాపే బాపిస్ట్ చర్చి సభ్యులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

December 25, 2024 / 01:18 PM IST