SRD: గుమ్మడిదలలో భారీగా నిషేధిత అల్ఫాజోలంను పట్టుకున్నారు. బుధవారం నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పారిశ్రామికవాడ పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 32 కిలోల అల్ఫోజోలంను స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమలో రియాక్టర్లు లీజుకు తీసుకుని మత్తుమందు తయారుచేస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: నల్గొండ జిల్లా కేతపల్లి మండలం రాయపురం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం క్రిస్మస్ వేడుకలో పాల్గొని మాట్లాడారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, క్షమాగుణం, నేర్పు, క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని, క్రీస్తు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు.
JN: పాలకుర్తి మండలంలోని వల్మీడి గ్రామంలో పురాతమైన శివాలయంలో ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులతో కలిసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు.
JN: పాలకుర్తి మండలంలోని వల్మీడి గ్రామంలో పురాతమైన శివాలయంలో ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులతో కలిసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు.
SRPT: కోదాడకి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బుధవారం అంగుళం సుద్ధ ముక్కుపై ఏసుప్రభు ప్రతిమ, పెన్సిల్ మనపై ఏసుప్రభు శిలువ ఆవిష్కరించి తన కళాత్మకతను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులపై అనేక అద్భుత కళాఖండాలు ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు.
ABD: సకల దేవతలకు నిలయమైన గోమాతను రక్షించాలని ధర్మ జాగరణ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో మహా పాదయాత్ర ప్రారంభించారు. హమాలివాడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సుందిల్ల శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం వరకు 250 కిలోమీటర్లు జరుగుతుందని ధర్మ జాగరణ సభ్యుడు రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు.
HYD: తార్నాక డివిజన్‌లోని లోగోస్ గాస్పల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
NLG: జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారించింది. జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నల్గొండ జిల్లాకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.
JN: కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామంలో రూ.2.50 కోట్ల వ్యయంతో ఆయకట్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా అన్నారు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణంతో సాగు నీటి సమస్య పోతుందన్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. సురేష్, రంగయ్య తదితరులున్నారు.
HYD: హైడ్రాకు ఇప్పటికే దాదాపు 6 వేల ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2025 కొత్త సంవత్సరంలో ప్రతి సోమవారం ట్యాంక్ బండ్ బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తామని ప్రకటించారు. మధ్యాహ్నం 1:30గం.ల నుంచి మ.3:30గం.ల వరకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తానన్నారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే 7207923085కు వివరాలు పంపొచ్చని తెలిపారు.
MBNR: క్రైస్తవులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండగ క్రిస్మస్ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అఖిల్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ప్రత్యేకంగా కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిల్‌ను శాలువాతో సన్మానించారు.
MNCL: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ విధులు నిర్వర్తిస్తున్న గిర్దావర్లు రమేష్, సాయిపై దాడి చేయడాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించే రెవెన్యూ ఉద్యోగులపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ శత జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నారాయణపేట జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్, రాజేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
KMM: చింతకాని మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా మండల అధ్యక్షులు కొండా గోపి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు. తన చివరి శ్వాస వరకు భారతదేశ అభివృద్ధికై కృషి చేశారని వారి సేవలను కొనియాడారు.
HYD: టోలిచౌకి, హకీంపేట్ డివిజన్‌లో గల వలసదారులతో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం టోలిచౌకి బస్ స్టాప్ వద్ద ఓ బిహారీ కూలి పై దాడి జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ బీహార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారితో చర్చించారు. వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.