• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి: ఎంఈవో

WNP: పానగల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఎంఈవో శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీ సిబ్బంది సమ్మెలో ఉన్నందున సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులు సబ్జెక్ట్ వారి గ్రూపులుగా ఏర్పడి పరస్పర సహకారంతో చర్చించుకుంటూ చదవాలని విద్యార్థులకు సూచించారు. SSC విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని విద్యార్థులకు సూచించారు.

December 25, 2024 / 12:04 PM IST

మందమర్రి ఏరియాకు 4వ బెస్ట్ ఏరియా అవార్డు

MNCL: సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ 4.0-2024లో మందమర్రి ఏరియాకు 4వ బెస్ట్ ఏరియాగా అవార్డు వచ్చినట్లు జీఎం దేవేందర్ తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెంలో ఏరియా తరఫున సివిల్ డిపార్ట్‌మెంట్ DY SE శ్రీధర్ రూలింగ్ ట్రోఫీని C&MDబలరాం చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు.

December 25, 2024 / 12:04 PM IST

రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి: మంత్రి

KMM: మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అనిత అనే విద్యార్థిని సీఎం కప్ పోటీల్లో భాగంగా ఇటీవల జరిగిన పుట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా అనితను అభినందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. అనిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవ్వడం సంతోషకరమన్నారు.

December 25, 2024 / 11:59 AM IST

తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్.. డిజైన్ ఫైనల్ చేసేదప్పుడే

HYD: రాజేంద్రనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టు భవన నిర్మాణానికి R&B శాఖ మరో రెండు వారాల్లో టెండర్లను పిలువనుంది. బిల్డింగ్ డిజైన్ ఫైనల్ చేసేందుకు నేడో, రేపో హైకోర్టు భవన నిర్మాణ కమిటీతో అధికారులు, బిల్డింగ్ డిజైన్ సంస్థ భేటీ కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ భవన నిర్మాణం కోసం రూ.2,583 కోట్ల నిధులను కేటాయించింది.

December 25, 2024 / 11:58 AM IST

గ్రేటర్‌లో మరో 40 చోట్ల చార్జింగ్ పాయింట్లు

HYD: బహిరంగ ప్రదేశాల్లో ఈ-వాహనాల కోసం చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు GHMC కసరత్తు చేస్తున్నది. గ్రేటర్‌లో EV కార్ల సంఖ్య దాదాపు 5వేల వరకు ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు. అందుకు అనుగుణంగా చార్జింగ్ పాయింట్లు పెంచుతున్నారు. ఇప్పటికే 43 ప్రాంతాల్లో అమలు అవుతుండగా.. తాజాగా మరో 40 చోట్ల చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు GHMC ఏర్పాట్లు చేస్తున్నది.

December 25, 2024 / 11:55 AM IST

పేదలకు దుస్తుల పంపిణీ

WNP: ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు క్రీ.శే. రాజరత్నం జ్ఞాపకార్థం కుమారుడు విజయ్ 50 మందికి దుస్తులను పంపిణీ చేపట్టారు. తన తండ్రి జ్ఞాపకంగా యేటా పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

December 25, 2024 / 11:52 AM IST

క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన అధికారి

WNP: ఆత్మకూరు మండలంలోని మూలమల్లలో సరళాదేవి, లక్ష్మారెడ్డి క్రీడా ప్రాంగణాన్ని బుధవారం వనపర్తి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి సుధీర్ రెడ్డి పరిశీలించారు. కబడ్డీ క్రీడా మైదానం ఏర్పాటును పరిశీలించారు. క్రీడా మైదానానికి కావలసిన సామగ్రికి సంబంధించి వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని తెలిపారు.

December 25, 2024 / 11:51 AM IST

రోడ్డుపై గొంతు కోసుకున్న వ్యక్తి

NLG: క్లాక్ టవర్ సెంటర్లో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సయ్యద్ నదీమ్ అనే వ్యక్తి తన గొంతు కోసుకుని రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో ఉన్నాడు. అది గమనించిన యువకులు పోలీసులకు, అంబులెన్స్‌కి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ SI నాగరాజు తన వాహనంలో అతడిని చికిత్స కోసం NLG ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 25, 2024 / 11:51 AM IST

ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

NRML: బుధవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సొన్ మండలం ఎస్సారెస్పీ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. రైతులు తమ పంటలు పండించుకునేందుకు సాగు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని అన్నారు.

December 25, 2024 / 11:49 AM IST

సిలువ ఆకారంలో విద్యుత్ స్తంభం

GDWL: విద్యుత్ స్తంభానికి ఓ పచ్చని తీగ ఎంతో ఆకర్షణీయంగా అల్లుకుపోయింది. బుధవారం క్రిస్మస్ పండుగ వేళ ఈ తీగ విద్యుత్ స్తంభానికి సిలువ ఆకారంలో చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ దృశ్యం మానవపాడు మండలంలోని గోకులపాడు వెళ్లే దారిలో దర్శనమిస్తోంది. క్రిస్మస్ పండగకు ఆహ్వానించే విధంగా స్తంభానికి తీగ అల్లుకొని ప్రకృతి రమణీయంగా కనిపించింది.

December 25, 2024 / 11:45 AM IST

‘మాతృభూమికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు వాజపేయీ’

MDK: మాతృభూమికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు స్వర్గీయ మాజీ ప్రధాని వాజపేయీ అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ రోజు వాజపేయీ 100వ జయంతి సందర్భంగా ‘X’ వేదికగా ఎంపీ నివాళులర్పించారు. దేశాభివృద్ధికి బాటలు పరిచి ప్రపంచానికి భారత్ శక్తిని చూపించిన ధైర్యవంతుడు అని పేర్కొన్నారు. కార్గిల్ విజయంతో భారత సైనిక సత్తాను పరిచయం చేసిన యోధుడు అని కొనియాడారు.

December 25, 2024 / 11:44 AM IST

మధిర మండలంలో పర్యటించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

KMM: మధిర పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం బుధవారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు చర్చిలలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలలో పాల్గొని స్థానిక ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

December 25, 2024 / 11:34 AM IST

ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే

SDPT: ఆపదలో ఉన్నవారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తోగుట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. వెంకట్రావుపేటకు చెందిన బెజ్జనమైన పోచవ్వ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2లక్షల ఎస్ఓసీ పంపగా.. అందించామన్నారు.

December 25, 2024 / 11:27 AM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి

MHBD: తొర్రూరు మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేరుగు దిలీప్ గౌడ్ & సిందూజ వివాహం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కానుకలు అందజేశారు. మాజీ జెడ్పీటీసీ జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, నలమాస ప్రమోద్ తదితరులున్నారు.

December 25, 2024 / 11:27 AM IST

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బానోతు రాజు నాయక్ గ్రామంలోని జజ్జరి బాలవ్వకు రూ.12 వేల విలువ గల చెక్కును నేరుగా వాళ్ల ఇంటి వెళ్లి బుధవారం పంపిణీ చేశారు. పేద ప్రజల అనారోగ్యాల ఖర్చులకై ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని తెలిపారు.

December 25, 2024 / 11:25 AM IST