• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి

NGKL: కొల్లాపూర్ నియోజకవర్గ క్రిస్టియన్ సోదరీ, సోదరి మనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూత అని పేర్కొన్నారు. శత్రువులను మిత్రులుగా మార్చి, వారు శాంతి మార్గంలో పయనించేలా ప్రేమను చూపారన్నారు. ఆయన మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు.

December 25, 2024 / 10:40 AM IST

ఈనెల 30 వరకు ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు

KMM: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన ప్రస్తుత విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశముందని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎం. పాపారావు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల కోసం ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించినందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 25, 2024 / 10:39 AM IST

సివిల్ ఇంజనీర్లకు న్యాయం చేస్తామని మంత్రి హామీ!

HYD: సెక్రటేరియట్ ముట్టడికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్లిన సివిల్ ఇంజనీర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. VRO, VRAల్లో ఇంటర్మీడియట్ చదివిన వారికి డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఇవ్వకుండా, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, సివిల్ ఇంజినీర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

December 25, 2024 / 10:37 AM IST

ఘోర రోడ్డుప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KMM: వైరాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. పాత బస్టాండ్ దగ్గర ఓ వ్యక్తిని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. పాదచారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళుతున్నట్లు తెలుస్తోంది. వైరా పోలీసులు క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

December 25, 2024 / 10:37 AM IST

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ ఛైర్మన్

MHBD: తొర్రూర్ మండలం మాడేడు గ్రామంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేసి గ్రామస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ పుట్టిన ఈ పవిత్రమైన రోజున అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. సంతోష్, నరేందర్ రెడ్డి, ప్రసాద్ ఉన్నారు.

December 25, 2024 / 10:34 AM IST

అయ్యప్ప ఆలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు

KMM: పట్టణంలోని శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి గుడిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ నంబూద్రి స్వామి అయ్యప్ప స్వామికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అయ్యప్పమాలధారులు పాల్గొన్నారు.

December 25, 2024 / 10:34 AM IST

‘పార్టీ బలోపేతానికి బూత్ కమిటీల అధ్యక్షులు కృషి చేయాలి’

KMR: పట్టణం 2వ వార్డు పరిధిలోని అడ్లుర్ గ్రామ బీజేపీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్ధాగత మార్పుల్లో భాగంగా186 బూత్ అధ్యక్షుడిగా మహేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్ బూత్ అధ్యక్షులను సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

December 25, 2024 / 10:32 AM IST

నిజాయితీ చాటుకున్న దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగులు

NLG: దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ నాగమణి, డ్రైవర్ జగదీష్ బస్సులో దొరికిన రూ. 30వేల విలువ గల మొబైల్‌ను డిపోలో అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు. నల్గొండ- దేవరకొండ రూట్లో నడుస్తున్న బస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా ప్రయాణికురాలు మొబైల్ పోగొట్టుకుంది. అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు విచారణ జరిపి బాధితురాలికి బుధవారం మొబైల్ అందజేశారు.

December 25, 2024 / 10:30 AM IST

నేటి అర్ధరాత్రి వరకు MMTS రైళ్లు

HYD: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు MMTS రైళ్ల సమయాన్ని పొడిగించారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్ నామా, ఫలక్ నామా-లింగంపల్లి స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 10:45 నుంచి అర్ధరాత్రి 12:55ని.ల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

December 25, 2024 / 10:27 AM IST

లేగదూడపై చిరుత దాడి

MBNR: దౌల్తాబాద్ మండలంలోని చల్లాపూర్‌లో చిరుత లేగదూడపై దాడిచేసి చంపిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలుముల సాయప్ప రోజులాగే తన పొలం దగ్గర పశువులను కట్టేసి రాగా.. చిరుతలు లేగదూడను లాక్కెళ్ళి చంపేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు.

December 25, 2024 / 10:26 AM IST

సౌత్ జోన్ క్రికెట్ జట్టు ఎంపిక

MBNR: పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు ఎంపికలు నిర్వహించినట్లు యూనివర్సిటీ పీడీ వై.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రో. శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప, OSD మధుసుదన్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, అబ్దుల్లా పాల్గొన్నారు.

December 25, 2024 / 10:24 AM IST

హైదరాబాద్‌లో ఉదయం దోశ.. రాత్రి బిర్యానీ

HYD: హైదరాబాదీలు బిర్యానీ ప్రియులు. నిమిషానికి 34బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. ఏడాదిలో 1.57కోట్ల ప్లేట్ల బిర్యానీలను ఆరగించారు. హైదరాబాద్‌కు సంబంధించి స్విగ్గీ విడుదల చేసిన ఆర్డర్లే ఇలాఉంటే మిగతా సంస్థలవి, రెస్టారెంట్‌లో, వేడుకల్లో ఆరగించే విందులను కలుపుకొంటే బిర్యానీల సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువే. అత్యధికులు చికెన్ బిర్యానీనే ఆరగిస్తున్నారు.

December 25, 2024 / 10:23 AM IST

అనిల్ జాదవ్‌ను కలిసిన శబరిమాత ఆశ్రమ సభ్యులు

ADB: ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన బోథ్ మండల కేంద్రానికి చెందిన శబరిమాత ఆశ్రమ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శబరిమాత ఆశ్రమ షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

December 25, 2024 / 10:22 AM IST

నాంపల్లి స్టేషన్ పునరాభివృద్ధి షురూ

HYD: నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నిత్యం 50వేల మందికి సేవలు అందించేలా ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.309 కోట్లను రైల్వేశాఖ ఖర్చు చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రయత్నిస్తోందని CPRO శ్రీధర్ వెల్లడించారు.

December 25, 2024 / 10:22 AM IST

ఫ్యూచర్ సిటీ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రూ.2వేల కోట్లు

HYD: పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తొలి దశలో భాగంగా రావిర్యాల్ నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న 41.5 కి.మీ రహదారికి సంబంధించి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2,000 కోట్లు మంజూరు చేస్తూ పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది.

December 25, 2024 / 10:20 AM IST