HYD: పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తొలి దశలో భాగంగా రావిర్యాల్ నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న 41.5 కి.మీ రహదారికి సంబంధించి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2,000 కోట్లు మంజూరు చేస్తూ పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది.