• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బానోతు రాజు నాయక్ గ్రామంలోని జజ్జరి బాలవ్వకు రూ.12 వేల విలువ గల చెక్కును నేరుగా వాళ్ల ఇంటి వెళ్లి బుధవారం పంపిణీ చేశారు. పేద ప్రజల అనారోగ్యాల ఖర్చులకై ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని తెలిపారు.

December 25, 2024 / 11:25 AM IST

టూ టౌన్ సీఐగా సృజన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు

KNR: నగరంలోని టూ టౌన్ సీఐని బదిలీ చేస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. టూ టౌన్ సీఐగా ఉన్న విజయ్ కుమార్‌ను ఐజీ కార్యాలయాని అటాచ్ చేశారు. టూ టౌన్ సీఐగా సుజన్ రెడ్డిని నియమిస్తూ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ కార్యాలయానికి అటాచ్‌లో ఉన్న అనిల్ కుమార్‌ను కరీంనగర్ ఎస్బీ 1కు బదిలీ చేశారు.

December 25, 2024 / 11:19 AM IST

రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యం

KMR: రైల్వే స్టేషన్‌లో నిద్రించిన బాలిక అదృశ్యమైనట్లు NZB రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. HYDకి చెందిన ఎర్రన్న తన అన్న కూతురు మహితో కలిసి ఈ నెల 23న పని నిమిత్తం కామారెడ్డికి వచ్చారు. తిరిగి వెళ్లేందుకు స్టేషన్‌కు రాగా ట్రైన్ మిస్ అయింది. దీంతో ఆ రాత్రి రైల్వేస్టేషన్‌లో నిద్రించారు. ఉదయం లేచి చూసే సరికి బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

December 25, 2024 / 11:11 AM IST

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడి మృతి

BDK: జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారని చెప్పారు. ఆయన మృతిపట్ల సీపీఐ, రైతు సంఘం నివాళి అర్పించింది.

December 25, 2024 / 11:10 AM IST

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడి మృతి

BDK: జిల్లా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారని చెప్పారు. ఆయన మృతిపట్ల సీపీఐ, రైతు సంఘం నివాళి అర్పించింది.

December 25, 2024 / 11:10 AM IST

డిప్యూటీ సీఎం బట్టి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

KMM: మధిరలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌లో బుధవారం చేరారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బోయపాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ ముఖ్య నేత దిరిశాల జగన్నాథ చారి సహా వార్డ్ ఇంఛార్జులు JV రెడ్డి, ఎల్వీ రెడ్డి, వినోద్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

December 25, 2024 / 11:08 AM IST

ధ్యాన మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

JGL: పట్టణంలోని శ్రీ గుట్ట రాజేశ్వరస్వామి దేవాలయంలో టీటీడీ 10 లక్షల నిధులతో ధ్యాన మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్‌తో బుధవారం కలిసి భూమిపూజ చేశారు. వారి వెంట బాలే శంకర్, ఆనందరావు, ప్రవీణ్ రావు, రాజేష్, నక్క గంగాధర్, క్రాంతి, బిక్షపతి, బలుసు సాయికుమార్, ఆలయ కమిటీ సభ్యులు నాగభూషణం, శంకర్‌రావు, తదితరులున్నారు.

December 25, 2024 / 11:05 AM IST

బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం

JN: కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ నరసింహులు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సనాది భాస్కర్ బుధవారం వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

December 25, 2024 / 10:58 AM IST

నాగినేనిపల్లి బీజేపీ కమిటీ ఎన్నిక

BNR: బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లిలో బీజేపీ నూతన కమిటీని ఆపార్టీ శక్తి కేంద్రం ఇన్‌ఛార్జ్ ముక్కర్ల గణేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పార్టీ 28వబూత్ ఇన్‌ఛార్జిగా సల్లశివ, 29వబూత్ ఇన్‌ఛార్జ్‌గా గుజ్జవిజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషిచేస్తామని, తమ ఎన్నికకు సహకరించిన పార్టీపెద్దలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

December 25, 2024 / 10:57 AM IST

చోరికి పాల్పడ్డ బీహారీ దంపతులు అరెస్ట్

HYD: రాజేంద్రనగర్ PS పరిధి బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ మేపిల్ టౌన్ విల్లాలో చోరికి పాల్పడ్డ బీహారీ దంపతులు అరెస్ట్ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరిని రాజేంద్రనగర్ క్రైమ్ టీమ్ పట్టుకున్నారు. చోరి చేసి ఆభరణాలతో బీహర్ చెక్కేసే వారి ప్రయత్నాన్ని పోలీసులు తిప్పి కొట్టారు. చోరి చేసిన బంగారం, ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు.

December 25, 2024 / 10:51 AM IST

తుమ్మలూరులో 300 ఎకరాల్లో పచ్చని పార్క్

RR: మహేశ్వరం పరిధి తుమ్మలూరు ప్రాంతంలో దాదాపుగా 300 ఎకరాలలో పచ్చని ఏకో పార్క్ అందాలను కనువిందు చేస్తుంది. ఈ ఉద్యానవనాలలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో మొక్కలు నాటే పనులను హైదరాబాద్ శివారు ప్రాంతాలు, నగరంలోనూ వేగవంతం చేసినట్లు పేర్కొంది.

December 25, 2024 / 10:48 AM IST

దొంగలనుంచి చాకచక్యంగా తప్పించుకున్న మహిళ

WNP: పెబ్బేరు పట్టణంలో బీసీ కాలనీ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి పండ్లు అమ్మే చిన్న పెంటమ్మ అనే మహిళా బుధవారం బండి తోసుకుంటూ వెళ్తుంది. బైకుపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని బంగారు నగలు దొంగింలించాడానికి ప్రయత్నించారు. ఆమె వారితో పోరాడి వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. దీంతో పలువురు ఆమెను అభినందించారు.

December 25, 2024 / 10:48 AM IST

పారదర్శకంగా ఇళ్ల సర్వే చేపట్టాలి: కలెక్టర్

MNCL: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్‌లో సిబ్బంది వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

December 25, 2024 / 10:48 AM IST

జీవితంపై విరక్తితో ఓ యువకుడి ఆత్మహత్య

KMR: బాన్సువాడ మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీర్కూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్‌కు చెందిన యావ హరీష్(19) మద్యానికి అలవాటు పడి జులాయిగా తిరిగేవాడు. కాగా మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు.

December 25, 2024 / 10:44 AM IST

నవోదయలో విద్యార్థినులకు వేధింపులు

KMR: నిజాంసాగర్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుడు కొంతకాలంగా విద్యార్థినులను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై విద్యార్థినులు ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పూర్వవిద్యార్థులు సోమవారం ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు రాత పూర్వకంగా రాయాలి.

December 25, 2024 / 10:40 AM IST