KMR: రైల్వే స్టేషన్లో నిద్రించిన బాలిక అదృశ్యమైనట్లు NZB రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. HYDకి చెందిన ఎర్రన్న తన అన్న కూతురు మహితో కలిసి ఈ నెల 23న పని నిమిత్తం కామారెడ్డికి వచ్చారు. తిరిగి వెళ్లేందుకు స్టేషన్కు రాగా ట్రైన్ మిస్ అయింది. దీంతో ఆ రాత్రి రైల్వేస్టేషన్లో నిద్రించారు. ఉదయం లేచి చూసే సరికి బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.