JN: కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ నరసింహులు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సనాది భాస్కర్ బుధవారం వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.