BNR: బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లిలో బీజేపీ నూతన కమిటీని ఆపార్టీ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ముక్కర్ల గణేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పార్టీ 28వబూత్ ఇన్ఛార్జిగా సల్లశివ, 29వబూత్ ఇన్ఛార్జ్గా గుజ్జవిజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషిచేస్తామని, తమ ఎన్నికకు సహకరించిన పార్టీపెద్దలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.