KMM: మధిరలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్లో బుధవారం చేరారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బోయపాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ ముఖ్య నేత దిరిశాల జగన్నాథ చారి సహా వార్డ్ ఇంఛార్జులు JV రెడ్డి, ఎల్వీ రెడ్డి, వినోద్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.