NLG: దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ నాగమణి, డ్రైవర్ జగదీష్ బస్సులో దొరికిన రూ. 30వేల విలువ గల మొబైల్‌ను డిపోలో అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు. నల్గొండ- దేవరకొండ రూట్లో నడుస్తున్న బస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా ప్రయాణికురాలు మొబైల్ పోగొట్టుకుంది. అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు విచారణ జరిపి బాధితురాలికి బుధవారం మొబైల్ అందజేశారు.