NRML: నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ నుండి నిస్సి చర్చి వరకు రూ 1.60 కోట్ల నిధులతో పూర్తిచేసిన ఆర్అండ్‌బీ రోడ్డును నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
HYD: ఏసుక్రీస్తు బోధనలు మానవాళిని సన్మార్గంలో నడిపిస్తాయని, ఏసు సూక్తులు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచం మొత్తం ఎంతో గొప్పగా జరుపుకొనే ఏకైక పండుగ క్రిస్మస్ అని ఆయన పేర్కొన్నారు.
WGL: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అటల్ బిహారి వాజ్‌పేయ్ శత జయంతి సందర్బంగా బుధవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్‌కి పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు పెద్దురి రాజు, తదితరులు పాల్గొన్నారు.
KMM: వైరాలో బుధవారం ఫైబర్ సేవలను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ ఫైబర్ సేవలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఫైబర్ సేవలను వైరా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు వెంకట నర్సిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్ పాల్గొన్నారు.
KMM: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం తల్లాడ రింగు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొని వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాజ్ పాయ్ హయాంలో పల్లెలు పట్టణాలు రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంచారని తెలిపారు.
WGL: వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు గురువారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
HYD: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియోను మహేశ్ గౌడ్ విడుదల చేశారు. ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమని మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశమన్నారు. మానవాళిని సత్య పథం వైపు నడిపించేలా క్రీస్తు మార్గం నిర్దేశమని అభివర్ణించారు.
GDL: అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠమైన అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను బుధవారం ఏపీ కమ్యూనికేషన్ డీఐజీ లక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద శర్మ ఆలయ మర్యాదలతో వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం, జోగులాంబ అమ్మవారికి కుంకుమ అర్చనలు నిర్వహించారు.
BDK: భద్రాచలంలో ఇద్దరు యువకులపై మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. బస్టాండ్ సమీపంలోని కారు పార్కింగ్ వద్ద వెంకటేశ్, వీర బాబు అనే యువకులతో కొంతమంది వ్యక్తులు ఘర్షణకు దిగి ఒక్కసారిగా ఇద్దరిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఒకరికి వీపులో, ఇంకొకరికి పొట్టపై గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఈ రోజు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి కలెక్టర్ దంపతులు మంత్రిని కలవడంతో ఆయన వారికి బొకే అందించారు. అనంతరం కలెక్టర్ తో కలిసి మంత్రి వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.
MDK: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ వద్ద గత రాత్రి బైక్ రోడ్డు కిందికి దూసుకుపోయి టీ మాందాపూర్ గ్రామానికి చెందిన అంగడి శ్రీకాంత్ అనే వ్యక్తి నీటిలో మునిగి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందారు. బంధువుల శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు బంధువులు తెలిపారు.
KMR: దేవునిపల్లి మల్లికార్జునస్వామిని బుధవారం దోమకొండ ఎస్సై ఆంజనేయులు దర్శించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గం ఆధ్వర్యంలో పురోహితులు ఆయన్ను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. వీడీసీ అధ్యక్షుడు గంగారం, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు రాహుల్, లింగారావు ఉన్నారు.
WGL: క్రిస్మస్ సందర్భంగా తన నివాసంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేశారు. ఏసుప్రభు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు భాస్కర్, సెక్రెటరీ ప్రకాశ్, భూషణ్, రాజు, తదితరులు ఉన్నారు.
BDK: భద్రాచలం రామాలయంలో వచ్చే నెల 10న ఉదయం ఉత్తర ద్వారదర్శన పూజలను నిర్వహించనున్నారు. ఇందులో ప్రత్యక్షంగా 2000, 1000, 500, 250 విలువైన సెక్టార్ టికెట్లను కొనాల్సి ఉంటుంది. దాదాపు 4 వేల మందికి ఇందులో అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన టికెట్లను బుధవారం నుంచి రామాలయం వద్ద 4 కౌంటర్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
SRD: గుమ్మడిదలలో భారీగా నిషేధిత అల్ఫాజోలంను పట్టుకున్నారు. బుధవారం నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పారిశ్రామికవాడ పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 32 కిలోల అల్ఫోజోలంను స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమలో రియాక్టర్లు లీజుకు తీసుకుని మత్తుమందు తయారుచేస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.