• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాజీ ప్రధాని వాజ్ పేయీ జయంతి

MDK: పెద్ద శంకరంపేటలోని బీజేపీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతిని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ మాట్లాడుతూ.. దేశం వాజ్‌పేయీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.

December 25, 2024 / 03:15 PM IST

దేవరకొండలో మనుస్మృతి గ్రంథ ప్రతుల దహనం

NLG: దేవరకొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మనుస్మృతి గ్రంథ ప్రతులను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర ఆంజనేయులు మాట్లాడుతూ.. 1927 డిసెంబర్ 25న బీఆర్ అంబేద్కర్ మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టారని అదే స్ఫూర్తిగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేయడం జరిగిందన్నారు.

December 25, 2024 / 03:12 PM IST

“బీజేపీ పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి’

ఖమ్మం: 43వ డివిజన్లో పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి అయినట్లు బీజేపీ రెండో పట్టణ అధ్యక్షులు తాజ్ నూత్ భద్రం తెలిపారు. డివిజన్లోని 175, 176, 177, 179వ పోలింగ్ బూత్ కమిటీల సంబంధించిన పత్రాలను బుధవారం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ సమక్షంలో రెండో పట్టణ ఎలక్షన్ అధికారి అల్లిక అంజయ్య, జిల్లా ఎలక్షన్ అధికారి గెంటేల విద్యాసాగర్‌కు అందజేశారు.

December 25, 2024 / 03:07 PM IST

ఏకశిల కళాశాల వద్ద ఉద్రిక్తత

హన్మకొండ: జిల్లాలోని ఏకశిల కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని శ్రీదేవి మృతిపై విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఫీజు కోసం కాలేజ్ యాజమాన్యం వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. కాలేజీ ముట్టడికి విద్యార్ధి సంఘాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న రాత్రి హాస్టల్‌లో శ్రీదేవి ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే.

December 25, 2024 / 03:06 PM IST

తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి: ఎస్ఎఫ్ఐ

కొత్తగూడెం: భద్రాచలం ఐటీడీఏ ఆఫీస్ ముందు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని జిల్లా ఉపాధ్యక్షులు భూపేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన ఇంతవరకు విద్యాశాఖకు మంత్రిని నియమించలేదని తెలిపారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

December 25, 2024 / 03:05 PM IST

పల్టీ కొట్టిన ఆటో.. మహిళకు తీవ్ర గాయాలు

ఖమ్మం: మణుగూరు మండల కేంద్రం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అటు ఆటో డ్రైవర్ కిందకు దూకేయడంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు.

December 25, 2024 / 03:03 PM IST

‘కార్మిక సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం’

SRD: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని మరచిపోయిందని బీఎంఎస్ జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ఏడాది నుంచి పథకాలు అందడం లేదని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం బిఎంఎస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

December 25, 2024 / 03:01 PM IST

‘దేశం.. భిన్నమతాల, కులాల సమూహం’

NZB: భారతదేశం భిన్న మతాలు, కులాల సమూహమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని సీఎస్ఐ చర్చీలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల ఆచారాలను గౌరవించడం మానవత్వమన్నారు.

December 25, 2024 / 02:55 PM IST

అనితను అభినందించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం: మల్లెమడుగు హైస్కూల్లో చదువుతున్న కె. అనిత అనే విద్యార్థిని సీఎం కప్ పోటీల్లో భాగంగా పుట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైంది. కాగా అనితను అభినందిస్తూ బుధవారం మంత్రి పొంగులేటి ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం గర్వకారణమన్నారు.

December 25, 2024 / 02:54 PM IST

స్మశానవాటికలో అసాంఘిక కార్యకలాపాలు!

MHBD: తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో దహన సంస్కారాలు చేయటానికి స్మశానవాటికలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన గదులు కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. అల్లరి మూకలు మద్యం, సిగరెట్లు, గంజాయి తాగడానికి స్థావరాలుగా చేసుకున్నారు. దీంతో స్మశానవాటిక గదులు అపరిశుభ్రంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

December 25, 2024 / 02:43 PM IST

వరంగల్‌లో వ్యక్తి అదృశ్యం

WGL: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన కొల్లూరి యాకయ్య గత వారం రోజులుగా కనపడటంలేదు అని బుధవారం కుటుంబ సభ్యులు తెలిపారు. యాకయ్యకు మతిస్థిమితం సరిగా లేదు అని, నడుచుకుంటూ వెళ్లాడని, ఆచూకీ తెలిసిన వారు ఈ నంబర్లకు 9908355851, 9652625795 సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు తెలిపారు.

December 25, 2024 / 02:41 PM IST

మాజీ ఎమ్మెల్యే నివాసంలో క్రిస్మస్ వేడుకలు

జనగామ: జిల్లా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఈ సందర్భంగా రాజయ్యకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజయ్య చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. ఏసుప్రభు ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

December 25, 2024 / 02:35 PM IST

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే

HNK: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బల్దియా పరిధి లోని 29వ డివిజన్ లోగల ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం పాపాయిపేట్ వరంగల్ యందు నేడు ఏర్పాటు చేసిన వేడుకలకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి కేక్ మేయర్ గుండు సుధారాణి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి పరంజ్యోతి సెక్రెటరీ సుధాకర్ వైకె నవీన్ కుమార్,పాల్గొన్నారు.

December 25, 2024 / 02:34 PM IST

అంపశయ్య నవీన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

హనుమకొండ జిల్లా కేంద్రంలో నేడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత అంపశయ్య నవీన్‌కు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ నాయకులు వన్నాల శ్రీరాములు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 84 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా పుష్ప గుచ్ఛం అందించారు.

December 25, 2024 / 02:29 PM IST

చార్మినార్ జోనల్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్

HYD: నూరుద్దీన్ ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో మంగళవారం సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఎగ్జిబిషన్లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొని, విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులు చదువుతోపాటు ఇతర నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. నైపుణ్యంతోనే ఉజ్వల భవిత సాధ్యమని విద్యార్థులకు సూచించారు.

December 25, 2024 / 02:27 PM IST