• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రాగి ఆకుపై ఏసుక్రీస్తు బొమ్మ

MDK: క్రిస్టియన్ సోదరుల పవిత్ర పండగ అయిన క్రిస్మస్ను పురస్కరించుకొని మనోహరాబాద్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్‌లో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మేడోజి బ్రహ్మచారి రాగి ఆకుపై ఏసుక్రీస్తు చిత్రపటాన్ని చిత్రించారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని రాగి ఆకుపై ఏసుక్రీస్తు చిత్రపటాన్ని చిత్రించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

December 25, 2024 / 05:54 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ అసదుద్దీన్

HYD: ప్రజలు సమస్యలను చెప్పుకునేందుకు MIM పార్టీ కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

December 25, 2024 / 05:54 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ అసదుద్దీన్

HYD: ప్రజలు సమస్యలను చెప్పుకునేందుకు MIM పార్టీ కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

December 25, 2024 / 05:54 PM IST

భూపాలపల్లిలో వాజ్‌పేయి జయంతి

BHPL: మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతిని ఘనంగా నిర్వహించారు. వాజ్‌పేయి చిత్రపటానికి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలు మరువలేనివని, వాజపేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

December 25, 2024 / 05:43 PM IST

బోయిన్‌పల్లిలో క్రిస్మస్ వేడుకలు.. ఎంపీ ఈటల ప్రార్థనలు

HYD: బోయిన్ పల్లి సీవీఆర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఎంతో గొప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కార్పొరేటర్ తిరుపతి యాదవ్, మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, ఆరెపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

December 25, 2024 / 05:39 PM IST

వాజ్ పేయి జీవితం అందరికీ ఆదర్శం: చింతల రామచంద్రారెడ్డి

HYD: వాజ్ పేయి జీవితం అందరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఖైరతాబాద్‌లో పార్టీ నేత మానేకర్ చంద్రు బాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి నవయుగ హృదయ సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్నారని చెప్పారు.

December 25, 2024 / 05:37 PM IST

సీఎస్ఐ చర్చిని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

మెదక్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ… ఆసియా ఖండంలోని ప్రసిద్ధిగాంచిన చర్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

December 25, 2024 / 05:34 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన పోచారం

నిజామాబాద్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం అందజేశారు. పుప్పల త్రిశూలకు రూ.39 వేలు, మంగలి రాచమ్మకు రూ.33 వేలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోటగిరి సుదర్శన్, పాల్గొన్నారు.

December 25, 2024 / 05:27 PM IST

సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

WNP: శ్రీరంగాపూర్ లోని అంబేడ్కర్ కాలనీలో ఇండ్ల మధ్యలో ఏపుగా పెరిగిన కంప చెట్లతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజును ఆదేశించగా జేసీబీ సాయంతో ఇండ్ల మధ్య కంపచెట్లను తొలగించారు. కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

December 25, 2024 / 05:21 PM IST

అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని

BDK: ఇల్లందులోని విట్టల్ రావు భవన్లో కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం పార్థివ దేహానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మృతి ప్రజా, రైతు ఉద్యమాలకు తీరని లోటన్నారు. బ్రహ్మం ఆశయాల సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

December 25, 2024 / 05:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్: డీఎస్పీ

SRPT: ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని డీఎస్పీ రవి తెలిపారు. బుధవారం క్రిస్మస్ పురస్కరించుకొని సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కాసింపేట బేతెస్త చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు, వితంతువులకు, చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ఏసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.

December 25, 2024 / 05:15 PM IST

ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం: మున్సిపల్ చైర్మన్

NRML: ఏసుక్రీస్తు జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకం అని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గొల్లమాడ గ్రామంలోని ది లివింగ్ చర్చిలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరారు.

December 25, 2024 / 05:12 PM IST

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 30 వరకు పెంపు

SRD: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు కడుపును ఈనెల 30వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష చదివే విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

December 25, 2024 / 05:11 PM IST

‘ఆదాయ పన్ను స్లాబ్ పరిమితి పెంచాలి’

NZB: అల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం బుధవారం బాసరలో నిర్వహించారు. AISTF భాగస్వామ్య సంఘం STU జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆదాయపన్ను స్లాబ్ పరిమితి పెంచాలని కోరారు. గత దశాబ్ది కాలంగా ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

December 25, 2024 / 04:55 PM IST

వర్షంలోనూ కొనసాగుతున్న నిరవధిక సమ్మె

NLG: 16రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొల్లూరి కృష్ణ, బొమ్మగాని రాజు అన్నారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టర్ ముందు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం16రోజుకి చేరిన సందర్భంగా మాట్లాడారు. తుఫాను ప్రభావం కురుస్తున్న వర్షంలోనూ వారు నిరసన తెలిపారు.

December 25, 2024 / 04:53 PM IST