JGL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 117 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసినట్లు తహశీల్దార్ వినోద్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పల వద్దకు వెళ్ళామన్నారు. అక్రమంగా నిల్వ ఇసుక కుప్పలను గుర్తించి సీజ్ చేసామన్నారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో గల ఎల్లారెడ్డిపేట, రాచర్ల బోప్పపూర్, సర్వాయి పల్లె, నారాయణ పూర్ కోరుట్లపేట నాలుగు గ్రామాలలో గల 1600 ఎకరాల ఆయకట్టుకు నీటిని బుధవారం విడుదల చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో పారుకం కాలువల పూడిక తీత పనులు పూర్తి చేశారు. రైతులకు పూర్తిగా చివరి మడి వరకు నీరు అందుతుందని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.
PDPL: రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 9 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 9,10,044 విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలను ఆదుకుంటామన్నారు.
BDK: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఆస్పత్రిలో పర్యటించిన ఆయన కార్మికులతో మాట్లాడారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల పెంపు, రావాల్సిన ఏరియర్స్ వచ్చే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరపుతామని హామీ ఇచ్చారు.
MDK: మెదక్ చర్చి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.35 కోట్లు ప్రకటించారు. చర్చి అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. అంతకు ముందు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
KNR: కరీంనగర్ మండలంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. మండలంలోని బహదూర్ఖాన్‌పేట్, ఎలబోతారం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం చేసిన పనులు, నిధులు, విధులు చేసిన పనులపై గ్రామ సభలో చర్చించారు. ఈ నివేదిక ఆధారంగా ఈనెల 30న కరీంనగర్ మండల పరిషత్లో ప్రజా వేదికలో వీటిపై నివేదించనున్నారు.
MDK: మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం ఏడుపాయల, మెదక్ పట్టణ కేంద్రంలోని చర్చిని బుధవారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తులో పాల్గొని విజయవంతం చేసిన పోలీస్ సిబ్బందిని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు.
NZB: బోధన్ మండలంలోని పెగడాపల్లి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం గురించిఈ నెల 28వ తేదిన ఎడపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతులతో సమావేశం నిర్వహించడంజరుగుతుందన్నారు. రైతులుఅధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.
కామారెడ్డి: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 16వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా బుధవారం విద్యార్థులకు రోడ్డుపై చదువులు చెప్పి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ ఉన్నారు.
నిర్మల్: భైంసా పట్టణంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని స్మరిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్: అక్కన్నపేట మండలానికి బుధవారం అంబులెన్స్‌ను కేటాయించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల ప్రజలు అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి మండల నాయకులు తీసుకువెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి అక్కన్నపేటకు 108 అంబులెన్స్‌ను కేటాయించారు. ఇందుకు గాను మండల నాయకులు ప్రజల పక్షాన మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపారు.
SRPT: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించాలని కోదాడ పట్టణ సీఐ రాము అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు 35, ఆటోలు 33 పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఆటోలలో పరిమితి మించి ప్రయాణికులని నడపొద్దని సౌండ్ సిస్టం ఉండొద్దని అన్నారు.
ADB: భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన ప్రమీలకి మంజూరు అయిన రూ. 42,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ బుధవారం అందజేశారు. ఆరోగ్య ఖర్చులరీత్యా అయిన వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.
KNR: శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధిలో ఆదర్శవంతమైన పాలన అందించిన మహనీయుడు అటల్ జీ అని కొనియాడారు.
NRML: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిర్మల్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జానారెడ్డి, రాంబాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో వారిని ఎన్నుకున్నట్లు తెలిపారు.