• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మూడు రోజులు త్రాగునీటి సరఫరాకు అంతరాయం

నారాయణపేట: జిల్లా కేంద్రానికి తాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్ లీకేజీ పనులు సింగారం చౌరస్తాలో వేగంగా కొనసాగుతున్నాయని, పనులను ఇంజనీర్ పర్యవేక్షణ చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ సునీత బుధవారం తెలిపారు. గురువారం నుంచి మరో మూడు రోజులు పట్టణానికి తాగునీరు అందించలేమని చెప్పారు. పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు పని చేస్తున్నారని అన్నారు.

December 26, 2024 / 07:45 AM IST

క్రీడల్లో ప్రతిభా కనబరచాలి: వీసీ

MBNR: సౌత్ జోన్ టోర్నీలో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎంపికైన ఖో-ఖో పురుషుల జట్టుకు ట్రాక్ షూట్, యూనిఫామ్స్ అందజేశారు. ఈ నెల 27 నుంచి సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులోని టోర్నీలో పాల్గొననున్నట్లు తెలిపారు.

December 26, 2024 / 07:43 AM IST

నేటి నుంచి పత్తి కొనుగోలు యధాతథం

NRML: బైంసా మార్కెట్‌లో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని బుధవారం పత్తి కొనుగోలును నిలిపివేయగా, గురువారం నుండి యధాతథంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని బైంసా మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మార్కెట్ ధరకు తమ పత్తిని అమ్ముకోవాలని సూచించారు.

December 26, 2024 / 07:40 AM IST

‘చింతూరు కేంద్రంగా మొబైల్ కోర్టును ఏర్పాటు చేయాలి’

కొత్తగూడెం: బుధవారం భద్రాచలం రామాలయ దర్శనానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ హరినాథ్‌ని భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటా దేవదానం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి వినతిపత్రం సమర్పించారు. పలు సమస్యలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.

December 26, 2024 / 07:38 AM IST

కోళ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా

MBNR: భూత్పూర్ నుంచి కర్నూల్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం గురువారం తెల్లవారుజామున ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రంగస్వామి, క్లీనర్ మన్యం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగస్వామి చికిత్స నిమిత్తం 108లో కర్నూల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 07:35 AM IST

టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా శంకర్

NRML: టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యవర్గాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా దాసరి శంకర్, ప్రధాన కార్యదర్శిగా అశోక్, ఉపాధ్యక్షులుగా మనోహర్ రెడ్డి, సుజాత, కోశాధికారిగా నాగయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఎస్ యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

December 26, 2024 / 07:21 AM IST

సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?

NLG: జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలోని 856 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ జీపీలు ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.

December 26, 2024 / 07:10 AM IST

తప్పిపోయిన బాలుడు.. కేసు నమోదు

సిద్దిపేట: బాలుడు తప్పిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన వివరాలు.. పట్టణంలోని లెక్చరర్ కాలనీలో ఉండే అల్లేపు లింగం కూమారుడు తేజ కుమార్ (11) ఈనెల 23న సాయంత్రం స్నేహితులతో ఆడుకుంటానని ఇంట్లో నుండి వెళ్ళాడు. ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

December 25, 2024 / 09:00 PM IST

మాజీ సీఎంను కలిసిన మాజీ చైర్మన్

WGL: క్రిస్మస్ సందర్భంగా BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ని తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను శాలువాతో సన్మానించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో క్రిస్టియన్ జేఎసీ నాయకులు సోలోమన్ రాజు, నెహెమియా, లియో లూయిస్ తదితరులున్నారు.

December 25, 2024 / 08:55 PM IST

ఘనంగా వాజ్ పేయి జయంతి వేడుకలు

SRPT: తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో భారతరత్న, దేశ మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలను బీజేపీ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గడ్డం ఉప్పలయ్య మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం, దేశ సుస్థిరత కోసం వాజ్ పేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

December 25, 2024 / 08:51 PM IST

సైబర్ నేరగాళ్ల వలలో తాడికల్ వాసి

KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన వోడ్నాల రాంప్రసాద్ అకౌంట్ నుంచి కొంత డబ్బును సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. ఈనెల 22న రూ. 5 వేలు, ఈనెల 23న రూ. 71,500 తన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. తన అకౌంట్ నుంచి డబ్బులు పోవడంతో బ్యాంకులో సంప్రదించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపాడు.

December 25, 2024 / 08:46 PM IST