• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎంకు మెమంటో బహుకరించిన నాయకులు

మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్ ఆధ్వర్యంలో సన్మానం చేసి వెంకటేశ్వర స్వామి మెమంటోను అందజేసీ స్వాగతం పలికారు. సీఎంని కలిసిన వారిలో సీనియర్ నాయకులు ఆనంద్, లక్మి నారాయణ తదితరులు ఉన్నారు.

December 25, 2024 / 08:42 PM IST

75వ సారి రక్తదానం చేసిన వ్యక్తి ఇతడే..!

KMR: ఆపద సమయాల్లో నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయ కర్త డా.బాలు.బుధవారం ఆయన మాతృమూర్తి స్వర్గీయ నీల విమల 12వ వర్ధంతి సందర్భంగా 75వ సారి రక్తదానం చేసి ఎమరాల్డ్ రక్తదాతల క్లబ్‌లో నమోదు కావడం జరిగింది. ఈ సందర్భంగా డా.బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

December 25, 2024 / 08:40 PM IST

రేపు అయ్యప్ప దేవాలయంలో ‘మహా పడి పూజా’

KNR: హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్దేశ్వర గుట్టపై ఈనెల 26న గురువారం శ్రీ అయ్యప్ప దేవాలయంలో ‘మండల పూజా మహోత్సవం (పడిపూజా)’ నిర్వహిస్తున్నామని దేవాలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. గురువారం రాత్రి 7 గంటలకు శ్రీమాన్ సి. వెంకటేశ్ శర్మ గురు స్వామి ఆధ్వర్యంలో ‘మహా పడిపూజా’ కార్యక్రమం జరుగుతుందన్నారు.

December 25, 2024 / 08:40 PM IST

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

వరంగల్: క్రిస్మస్ సందర్భంగా వరంగల్ లక్ష్మిపురం వెంకట్రామ జంక్షన్ వద్ద గల బెతేస్థ బాప్టిస్ట్ చర్చ్‌లో నేడు ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. శాంతి కరుణ, సేవాగుణం, సహనం ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయమన్నారు.

December 25, 2024 / 08:40 PM IST

తప్పిపోయిన బాలుడు

SDPT: బాలుడు తప్పిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన వివరాలు.. పట్టణంలోని లెక్చరర్ కాలనీలో ఉండే అల్లేపు లింగం కూమారుడు తేజ కుమార్ (11) ఈనెల 23న సాయంత్రం స్నేహితులతో ఆడుకుంటానని ఇంట్లో నుండి వెళ్ళాడు. ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

December 25, 2024 / 08:39 PM IST

గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్టు

SDPT: చేర్యాల పట్టణ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న యువకులను రిమాండ్‌కు తరలించినట్లు చేర్యాల సీఐ శీను తెలిపారు. బుధవారం చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేర్యాల ఎస్ఐ నిరేశు వచ్చిన సమాచారంతో పట్టణ శివారులోని గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి అమ్ముతున్నట్టు తెలిపారు.

December 25, 2024 / 08:39 PM IST

మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగ్

KMR: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ (డిచ్పల్లి) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని కాయసమ్ పల్లి గ్రామంలో మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగ్‌ను బుధవారం ప్రారంభించారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ.. మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చని సూచించారు.

December 25, 2024 / 08:33 PM IST

ఈనెల 27న కొబ్బరికాయల విక్రయ బహిరంగ వేలం

NRML: దిలావర్పూర్ మండలం కదిలి గ్రామంలోని ప్రసిద్ధ మాత అన్నపూర్ణేశ్వరి సహిత పాపాహేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27న కొబ్బరికాయల విక్రయ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బుధవారం ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రిని ఒక సంవత్సరం కాలపరిమితితో విక్రయించుకొనుటకు ఆసక్తి కలవారు రూ. 50,000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలని కోరారు.

December 25, 2024 / 08:33 PM IST

రోడ్లను ఆక్రమించి వెలిసిన వ్యాపార దుకాణాలు

KNR: హుస్నాబాద్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ పక్కన, రోడ్డుకు ఇరువైపులా రోడ్డును ఆక్రమించి కూరగాయల దుకాణాలు వెలిచాయి. కొన్నేళ్లు గడుస్తున్నా పక్కనే ఉన్న పోలీసులు, మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులకు, బాటసారులకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిపైన చర్యలు తీసుకోవాలన్నారు.

December 25, 2024 / 08:31 PM IST

గంజాయి విక్రయం.. నలుగురు యువకులు అరెస్ట్

WGL: చేర్యాల పట్టణ కేంద్రంలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు యువకులను చేర్యాల పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ శ్రీను, ఎస్సై నీరేష్ తెలిపారు. చేర్యాల మండలానికి చెందిన యువకులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారన్నారు. వారి అవసరాలకు ధూల్ పేట నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

December 25, 2024 / 08:31 PM IST

ఐఐటీలో ఎన్సీసీ శిబిరం

SRD: కందిలోని ఐఐటీ హైదరాబాదులో ఎన్‌సీసీ 33 తెలంగాణ యూనిట్ కమాండర్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రమేష్ బుధవారం సందర్శించారు. ఈనెల 21వ తేదీన ప్రారంభమైన శిబిరం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్షణ ద్వారా శారీరక, ఐఐటీలో ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలని సూచించారు.

December 25, 2024 / 08:24 PM IST

భీంగల్‌ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

నిజామాబాద్: భీంగల్‌ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణను పరిశీలించారు. ఈకార్యక్రమంలో భీంగల్‌ సీఐ నవీన్‌, ఎస్సై మహేశ్‌, ఏఎస్సై అబ్దుల్‌ సత్తార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

December 25, 2024 / 08:18 PM IST

రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NRML: బుధవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మామడ మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా మామడ మండలం పోతారం గ్రామం నుండి తిరుపెల్లి గ్రామం వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో 1.35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుపరులకు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

December 25, 2024 / 08:10 PM IST

క్రైస్తవ మహిళలకు చీరలు పంపిణీ చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్

ఖమ్మం: క్రిస్టమస్ పండుగ సందర్భంగా మధిర మండల పరిధిలోని సైదేల్లిపురం గ్రామ చర్చిలో క్రైస్తవ మహిళలకు ఆ గ్రామం మాజీ సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన చీరలను మధిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మధు చేతుల మీదుగా పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

December 25, 2024 / 08:09 PM IST

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

MBNR: హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన నాగలక్ష్మికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో భర్త శివ కుమార్ 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. 108 సిబ్బంది ఈఎంటీ మెహబూబ్ భాష పైలెట్ శివశంకర్ టంకర గ్రామానికి చేరుకొని నాగలక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో దారి మధ్యలోనే పండంటి మగ బిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.

December 25, 2024 / 08:06 PM IST