వరంగల్: క్రిస్మస్ సందర్భంగా వరంగల్ లక్ష్మిపురం వెంకట్రామ జంక్షన్ వద్ద గల బెతేస్థ బాప్టిస్ట్ చర్చ్‌లో నేడు ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. శాంతి కరుణ, సేవాగుణం, సహనం ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయమన్నారు.