ఖమ్మం: క్రిస్టమస్ పండుగ సందర్భంగా మధిర మండల పరిధిలోని సైదేల్లిపురం గ్రామ చర్చిలో క్రైస్తవ మహిళలకు ఆ గ్రామం మాజీ సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన చీరలను మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు చేతుల మీదుగా పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.