KMR: ఆపద సమయాల్లో నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయ కర్త డా.బాలు.బుధవారం ఆయన మాతృమూర్తి స్వర్గీయ నీల విమల 12వ వర్ధంతి సందర్భంగా 75వ సారి రక్తదానం చేసి ఎమరాల్డ్ రక్తదాతల క్లబ్లో నమోదు కావడం జరిగింది. ఈ సందర్భంగా డా.బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.