• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కారేపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

KMM: వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఈరోజు కారేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కారేపల్లి క్రాస్ రోడ్ నందు నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లును భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

December 26, 2024 / 04:50 PM IST

వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి

KMM: అశ్వారావుపేట పర్యటన అనంతరం ములకలపల్లికి వెళ్తున్న మంత్రి పొంగులేటి గురువారం మార్గమధ్యంలో వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుని, సంక్రాంతి నాటికి ఇళ్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు చేతి గాజులు వేయించుకోవడానికి కొంత నగదు అందజేశారు.

December 26, 2024 / 04:48 PM IST

‘పెద్ద గట్టు జాతరకు గుడివద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తాం’

NLG: తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.పెద్ద గట్టు ఆలయానికి చైర్మన్‌ను త్వరలోనే నియమిస్తామని చెప్పారు. గురువారం దురాజ్ పల్లి ఆలయ పరిసరాలను పరిశీలించారు.

December 26, 2024 / 04:43 PM IST

హెడ్ కానిస్టేబుల్స్‌కు పదోన్నతులు

MDK: మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐ పదోన్నతులు కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఏఎస్సైగా పదోన్నతులు పొందిన జానీ భాష, ఉమర్‌లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిద్దరికీ స్టార్లను ఏర్పాటు చేసి అభినందించారు.

December 26, 2024 / 04:43 PM IST

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రి జిల్లా నుంచి సీఎం కప్ -2024రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన 600మంది క్రీడాకారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభినందనలు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే దగ్గరుండి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫేడ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, DYSO పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

December 26, 2024 / 04:42 PM IST

వాసవి క్లబ్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

NLG: మునగాల మండల కేంద్రంలో 2025 సంవత్సరానికి గాను మునగాల మండల వాసవి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వాసవి క్లబ్ మండల మాజీ అధ్యక్షుడు కాపర్తి మణికంఠ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షులుగా అర్వపల్లి ప్రవీణ్, కార్యదర్శిగా కందిబండ సతీష్, కోశాధికారిగా బ్రహ్మదేవర అఖిల్‌‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు.

December 26, 2024 / 04:39 PM IST

భైంసాలో పత్తి ధర వివరాలు

ADB: భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. గురువారం సీసీఐ పత్తి ధర రూ.7,471గా, ప్రైవేటు పత్తి ధర రూ.7,000 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. మంగళవారం ధరలతో పోలిస్తే సీసీఐలో రూ.50 తగ్గిందని, ప్రైవేటులో ఎలాంటి మార్పులేదన్నారు.

December 26, 2024 / 04:36 PM IST

నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం

NLG: నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. శౌలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామంలో కల్తీ కల్లు తాగి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు వారిని నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

December 26, 2024 / 04:35 PM IST

వల్మీడి ఆలయానికి మకర తోరణాలు అందజేత

JN: పాలకుర్తి మండలం వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారికి గురువారం జనగామ పట్టణానికి చెందిన భక్తులు బెల్లీదే ఉపేందర్-పద్మ దంపతులు మకర తోరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుందరాచార్యులు, ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నీరటి చంద్రయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

December 26, 2024 / 04:24 PM IST

అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ఆల్ ఇండియా బంజారా సంఘం ఆధ్వర్యంలో గురువారం నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారా చంద్ నాయక్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో హోం మంత్రి అమీషా అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు, ప్రధాని మోడీ ఆయనను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

December 26, 2024 / 04:21 PM IST

‘పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలి’

NLG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని టీఎస్ యూటిఎఫ్ జిల్లా కార్యాలయంలో టీఎస్ యూటిఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొని మాట్లాడారు.

December 26, 2024 / 04:21 PM IST

‘ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి’

HYD: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగాల కోసం ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తిచేసి, వయోపరిమితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

December 26, 2024 / 04:21 PM IST

బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రులు

WGL: నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈరోజు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాస్పిటల్‌కి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్ది ఉన్నారు.

December 26, 2024 / 04:20 PM IST

కాటమయ్యకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

SRPT: మద్దిరాల మండలం చిననెమిల గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కాటమయ్య పండుగలో ఎమ్మెల్యే మందుల సామేలు గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవిలమల్లు, నాయకులు పాల్గొన్నారు.

December 26, 2024 / 04:20 PM IST

వివిధ కేసులలో పట్టుపడ్డ వాహనాలు వేలం

KMM: సత్తుపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుబడిన మూడు ద్విచక్ర వాహనాలకు శుక్రవారం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు అప్సెట్‌కు ప్రైస్ 50% సొమ్మును డిపాజిట్గా చెల్లించాలని, వాహనం దక్కించుకున్న వారు 18% జీఎస్టీతో పాటు మిగతా మొత్తం సొమ్మును చెల్లించాల్సి ఉంటుందన్నారు.

December 26, 2024 / 04:18 PM IST