BDK: సీపీఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో సీపీఐ జెండాను పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ, వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా రథసారథి, జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. పేదల తరపున పోరాడే పార్టీ సీపీఐ అని అన్నారు.
HYD: షేక్‌పేట డివిజన్లో పరిధిలో గురువారం స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో కొనసాగుతున్న రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. రూ.1.9 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.
KMR: బాన్సువాడ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జనవరి 27న హైదరాబాదులో జరగనున్న వెయ్యి గొంతులు లక్షడప్పులు దండోరా మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గరుగళ్ల బాలరాజ్, ఎంఎస్‌పీ సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు జిల్లా అధ్యక్షులు మెక్కా సాయిమాదిగ తదితరులు పాల్గొననున్నారు.
HYD: కంటోన్‌మెంట్ 6వ వార్డులో గురువారం కంటోన్‌మెంట్ బోర్డు మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ పర్యటించారు. జవహర్ రైల్వే కాలని & జూపిటర్ కాలనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటోన్‌మెంట్ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా త్వరితగతిన సమస్యను పరిష్కారించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభినయన్ ఉద్యోగులు గత 17 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈరోజు దీక్షకు సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబు గౌడ్ మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 20వేల మంది పనిచేస్తున్నారని అన్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని లేదా పే స్కేల్ అమలు చేయాలని అన్నారు.
HYD: వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలోని టెంపుల్ బస్టాప్ వద్ద వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని MLA కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో మరువని నేతగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.
కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు సాహిబ్జాదాలు బాబా అజిత్ సింగ్, బాబా జుఝర్ సింగ్, బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ త్యాగాలను స్మరించుకుంటూ వీర్ బాల్ దివస్ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
MBNR: కేంద్ర రక్షణ శాఖ సహయ మంత్రి బండి సంజయ్ గురువారం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో పర్యటించారు. సంపూర్ణత అభియాన్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని, పల్లె దవాఖానను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి, అంగన్వాడీ ద్వారా గర్భిణీలకు, పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి తెలుసుకున్నారు.
ADB: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ మండలంలోని వేణునగర్ కాలని, లక్కారం గ్రామాలలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
HYD: ఫూల్‌బాగ్‌లో నిర్వహించిన టైగర్ నరేంద్ర మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్-2024 సీజన్-4ను గురువారం గౌలిపుర డివిజన్ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత చదువులోనే కాకుండా క్రీడలవైపు కూడా ఆసక్తి కనబరచాలని సూచించారు. క్రీడల్లో మంచిగా రాణిస్తే ఉన్నతస్థాయికి ఎదగవచ్చని తెలిపారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
కరీంనగర్: మల్లాపూర్ మండల కేంద్రంలోని మల్లన్న గుడి కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల ద్వారా మంజూరైన రూ.3 లక్షల ప్రొసీడింగ్స్‌ను గురువారం స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీకి అందించారు. మల్లన్న గుడి అభివృద్ధికి సహకరించిన ఎంపీ అరవింద్‌కు యాదవ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.
SRD: అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు దళిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
నిర్మల్: కడెం ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఎమ్మెల్యే బొజ్జను సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ జిల్లా నాయకులు సున్కారి రాజేష్ కోరారు. ఈ మేరకు ఆయన కడెం మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం వినతిపత్రం సమర్పించారు. కడెం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు వైద్య చికిత్సల కోసం వస్తారని, మంచి వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు.
KNR: సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేయటం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటూ రాక్షస పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు సరైన సమాధానం చెబుతారని అన్నారు.
KNR: సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేయటం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటూ రాక్షస పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు సరైన సమాధానం చెబుతారని అన్నారు.