JGL: BRS సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అరెస్టుపై ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే BRS నేతల మీద కేసులు అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు.
SRD: మండల పూజా మహోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు పుష్పాలకు పూజలు చేసి స్వామివారికి సమర్పించారు. పుష్పాలను అయ్యప్పస్వామికి ప్రత్యేకంగా అలంకరించారు.
SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఉద్యోగులు పాటల రూపంలో పాడారు. వేతనాలు రాకపోవడంతో ఇలా ఇబ్బంది పడుతున్నామో పాటల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దత్తు, కార్యదర్శి అనిల్ చారి పాల్గొన్నారు.
KMR: కామారెడ్డి జిల్లా వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. జిల్లాగా మారిన తర్వాత కామారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు.
కామారెడ్డి: భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకునేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో గురువారం మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
SRCL: వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో నిన్నటి రోజు పుట్టిన నేపథ్యంలో ఫౌండేషన్ వారు ఫుడ్ పంపిణీ చేశారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నాన్ వెజ్ ఫుడ్‌ను కొందరు యాచకులు,నిరుపేదలు ఆలయ ప్రాంగణంలో తీసుకువెళ్లి తిన్నారని, ఇక్కడ ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని ఎస్పీ మీడియాకు తెలిపారు. నాన్‌వేజ్ ఫుడ్ పంపిణీ చేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
HNK: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిశోర్ ఝ నేడు ఆదేశాలను జారీ చేశారు. స్పెషన్ బ్రాంచ్ ఎస్సైగా పని చేస్తున్న బి. మాధవ్‌తో పాటు, ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న పి. శ్రీకాంత్ లను హనుమకొండ పోలీస్ డివిజన్ పరిధిలోని కెయుసి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
NZB: ఈనెల 27 నుంచి 30 వరకు మహబూబ్‌నగర్‌లో జరగబోయే రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు సిరికొండ మండలం చిమన్ పల్లి గ్రామానికి చెందిన వినోద్ నాయక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వినోద్ నాయక్ కాకతీయ యమున క్యాంపస్‌లో కబడ్డి కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంధర్భంగా పాఠశాల డైరెక్టర్ రామోజీ, ప్రిన్సిపాల్ గిరిధర్ పలువురు అభినందనలు తెలిపారు.
SDPT: ఉద్యమ నాయకుడు, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని BRSV జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి అన్నారు. సిద్దిపేటలో వారు మాట్లాడుతూ.. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా శ్రీనివాసన్ను ఆరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఉద్యమ నేతగా, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు.
WGL: ఇందిరమ్మ ఇళ్ల కోసం నిర్వహిస్తున్న సర్వే సమాచారాన్ని ఆప్ లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. నగర పరిధి లోని ఖాజీపేట సర్కిల్ 56 వ డివిజన్ మారుతి నగర్ లో కొనసాగుతున్న సర్వే తీరును కమిషనర్ గురువారం ఆకస్మికంగా పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.
PDPL: సర్వ శిక్షా అభియాన్ (SSA) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేస్తున్న దీక్ష గురువారం నాటికి 17వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ చెవులలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని వారు కోరారు.
WNP: పానగల్ మండలంలోని రేమద్దుల గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు దీక్షా శిబిరాన్ని గురువారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
NRML: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాలలో కేజీబీవీ పాఠశాలలో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డిఇఓ రామారావు ఎంఈఓ లను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్‌మెన్‌లు, టీచింగ్ స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని అన్నారు.
MBNR: డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల వేడుకలకు సంబంధించి మొత్తం 10 పోలీస్ బృందాలతో తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు గురువారం వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 31 న మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు.
NLG: దేవరకొండ డిపో నుంచి నల్గొండ డిపో వరకు అధికారులు బస్సు సేవలను ప్రారంభించారు. నాంపల్లి-గుండ్రంపల్లి-చండూరు-మునుగోడు మీదుగా బస్సు నడుస్తుందన్నారు. బస్సు లేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి బస్సు సౌకర్యం కల్పించారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.