• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

WNP: పానగల్ మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని మండల విద్యాధికారి శ్రీనివాసులు గురువారం సందర్శించారు. ఈసందర్భంగా మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, ఒక ప్రణాళికతో చదువుతూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను సూచించారు.

December 26, 2024 / 04:18 PM IST

రేపు బిక్కనూరు మండలానికి షబ్బీర్ అలీ రాక

KMR: బిక్కనూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రేపు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో వెంకటేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటు కాచాపూర్ గ్రామంలోని వీరేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.

December 26, 2024 / 04:17 PM IST

‘లేబర్ ఇన్సూరెన్‌ను సద్వినియోగం చేసుకోండి’

MBNR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పీఎసీఎస్సీ ఛైర్మన్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 55 ఏళ్లు అందరూ ఉద్యోగులు తప్ప అందరూ అర్హులని తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

December 26, 2024 / 04:15 PM IST

పడమటిపల్లిలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు

NLG: దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో సీపీఐ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు రంగారెడ్డి, కిన్నెర యాదయ్య, వలమల్ల ఆంజనేయులు, ముడి రాజు పాల్గొన్నారు.

December 26, 2024 / 04:15 PM IST

బాల్య వివాహాలను వ్యతిరేకంగా ర్యాలీ

GDWL: గట్టు మండలం ఇందువాసి గ్రామంలో ఎంవీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ ఫ్లాష్ కార్డులు పట్టుకొని ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాలల ఛైర్మన్లు, గ్రామ సీఆర్పీఎఫ్ సభ్యులు , గ్రామ పెద్దలు ఎంవీఎఫ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు.

December 26, 2024 / 04:12 PM IST

‘విలీనం చేస్తే ఉద్యమం తప్పదు’

WNP: పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామపంచాయతీని జంగమయ్య పల్లి గ్రామపంచాయతీలో విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉద్యమం తప్పదని మాజీ సర్పంచ్ జయంతి హెచ్చరించారు. గ్రామపంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బలిజపల్లిలో గత 4 రోజులుగా గ్రామస్థులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో గురువారం ఆమె పాల్గొని మాట్లాడారు.

December 26, 2024 / 04:10 PM IST

లబ్దిదారులకు చెక్కులు పంపిణీ షబ్బీర్ అలీ

KMR: కామారెడ్డి నియోజకవర్గనికి చెందిన పలువురు లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ CMRF చెక్కులు పంపిణి చేయడం జరిగింది. గురువారం రోజున ఆర్& బి గెస్ట్ హౌస్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నియోజవర్గానికి సంబంధించిన వివిధ అనారోగ్యంతో బాధపడ్డ కుటుంబాలకు ఆర్ధిక భరోసా కోసం సీఎం సహానిధి ధ్వరా చెక్కులను అందించారని అన్నారు.

December 26, 2024 / 03:58 PM IST

‘పేదల తరఫున పోరాడే ఏకైక పార్టీ సీపీఐ’

BDK: సీపీఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో సీపీఐ జెండాను పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ, వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా రథసారథి, జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. పేదల తరపున పోరాడే పార్టీ సీపీఐ అని అన్నారు.

December 26, 2024 / 03:54 PM IST

రూ.1.9 కోట్లతో రోడ్డు పనులు

HYD: షేక్‌పేట డివిజన్లో పరిధిలో గురువారం స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో కొనసాగుతున్న రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. రూ.1.9 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.

December 26, 2024 / 03:52 PM IST

‘వెయి గొంతులు లక్ష డప్పులు’ మహా ప్రదర్శనను విజయవంతం చేయాలి

KMR: బాన్సువాడ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జనవరి 27న హైదరాబాదులో జరగనున్న వెయ్యి గొంతులు లక్షడప్పులు దండోరా మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గరుగళ్ల బాలరాజ్, ఎంఎస్‌పీ సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు జిల్లా అధ్యక్షులు మెక్కా సాయిమాదిగ తదితరులు పాల్గొననున్నారు.

December 26, 2024 / 03:51 PM IST

డ్రైనేజీ నిర్మాణాన్ని ప్రారంభించిన రామకృష్ణ

HYD: కంటోన్‌మెంట్ 6వ వార్డులో గురువారం కంటోన్‌మెంట్ బోర్డు మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ పర్యటించారు. జవహర్ రైల్వే కాలని & జూపిటర్ కాలనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటోన్‌మెంట్ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా త్వరితగతిన సమస్యను పరిష్కారించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

December 26, 2024 / 03:51 PM IST

‘సమగ్ర శిక్ష అభినయన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలి’

వనపర్తి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభినయన్ ఉద్యోగులు గత 17 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈరోజు దీక్షకు సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబు గౌడ్ మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 20వేల మంది పనిచేస్తున్నారని అన్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని లేదా పే స్కేల్ అమలు చేయాలని అన్నారు.

December 26, 2024 / 03:50 PM IST

వంగవీటికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణారావు

HYD: వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలోని టెంపుల్ బస్టాప్ వద్ద వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని MLA కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో మరువని నేతగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.

December 26, 2024 / 03:48 PM IST

బీజేపీ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం

కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు సాహిబ్జాదాలు బాబా అజిత్ సింగ్, బాబా జుఝర్ సింగ్, బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ త్యాగాలను స్మరించుకుంటూ వీర్ బాల్ దివస్ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

December 26, 2024 / 03:47 PM IST

రాయికోడ్ గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి

MBNR: కేంద్ర రక్షణ శాఖ సహయ మంత్రి బండి సంజయ్ గురువారం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో పర్యటించారు. సంపూర్ణత అభియాన్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని, పల్లె దవాఖానను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి, అంగన్వాడీ ద్వారా గర్భిణీలకు, పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి తెలుసుకున్నారు.

December 26, 2024 / 03:46 PM IST