MNCL: CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నస్పూర్ లోని SRP ఓసీ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కార్మిక నాయకులు ప్లకార్డ్స్ చూపుతో గురువారం నిరసన వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ రాజేశం మాట్లాడుతూ.. పార్లమెంటులో అంబేద్కర్‌ను అవమానపరిచేలా మాట్లాడిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రి వర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేశారు.
నిర్మల్: జిల్లాకు చెందిన యువకులు సీఎంలను, మాజీ సీఎంలను పోటాపోటీగా కలుస్తున్నారు. బ్రాహ్మణ సంక్షేమ బాసర మండల ఉపాధ్యక్షుడు సాయి కళదర్ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే బీజేపీ నాయకుడు సాయినాథ్ ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. కాంగ్రెస్ పార్టీ బాసర మండల అధ్యక్షుడు రమేష్ తనయుడు సచిన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పెద్దమ్మ తండాలో దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త దాడి చేయడంతో సంతోష (25) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
JN: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో రేపు మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు లింగాల గణపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి హాజరవుతారు.
HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ శతజయంతి ఉత్సవాలను జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఏల్లేష్ నేడు ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీ జెండాను ఆవిష్కరించి అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షాన పోరాటాలు చేసే సత్తా ఒక కమ్యూనిస్టులకే ఉందన్నారు.
KMM: సీపీఐ వందో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గురువారం ఖమ్మంలో సీపీఐ శత వసంతాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ శ్రేణులు స్థానిక పాత కలెక్టరేట్ నుండి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు ఎర్ర దండు కవాతు నిర్వహించారు. తొలుత ఇందిరానగర్‌లోని పైలాన్ వద్ద అరుణ పతాకాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
నిర్మల్: ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంచాలని AISTF జాతీయ ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్ అన్నారు. బాసరలోని ఆధ్య హోటల్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన తెలంగాణ కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. దేశంలో పాఠశాల స్థాయిలో డిటెన్షన్ విధానం అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. CCE పద్ధతిలో పరీక్షలు, సిలబస్‌ను పున:సమీక్షించాలని అన్నారు.
SDPT: నిరుపేదలకు ఇళ్లను అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని సిద్దిపేట జిల్లా కార్యదర్శి చిక్కుడు అనిల్ కుమార్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. పేద ప్రజలకు ఇళ్లను అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతాయన్నారు.
ADB: బోథ్ మండలంలోని నకలవాడ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దైవచింతనతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలందరూ నడవాలని పిలుపునిచ్చారు.
ADB: బోథ్ మండలంలోని నకలవాడ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దైవచింతనతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలందరూ నడవాలని పిలుపునిచ్చారు.
SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శతజయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ చరిత్ర ఎంతో గొప్పదని, నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగిస్తుందని, ఈనెల 30న నల్గొండ జిల్లాలో జరిగే సీపీఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
PDPL: నేత్రదానం మహా పుణ్యకార్యమని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మాచారి అన్నారు. గురువారం ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత బూర సదానందం సంస్మరణ సభను నిర్వహించారు. ఈసందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానంపై అవగాహన కల్పించారు. అనంతరం నేత్రదాత కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని అందజేశారు.
కామారెడ్డి: పెద్ద కోడపగల్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు బైక్ ర్యాలీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ.. ఈ నెల 29న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గంలో నిర్వహించే బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
HNK: కాజీపేట మండలం మడికొండ ప్రధాన రహదారిపై నేడు లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో రాజేష్ అనే అయ్యప్ప స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం రోడ్డు క్రాస్ చేస్తున్న రాజేష్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. కుడికాలు నుజ్జు నుజ్జు కావడంతో 108 సర్వీస్‌లో ఆసుపత్రికి తరలించారు.
KMM: చంద్రుగొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. సీసీ రోడ్ల శంకుస్థాపనలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు అన్నారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.