KMM: సీపీఐ వందో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గురువారం ఖమ్మంలో సీపీఐ శత వసంతాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ శ్రేణులు స్థానిక పాత కలెక్టరేట్ నుండి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు ఎర్ర దండు కవాతు నిర్వహించారు. తొలుత ఇందిరానగర్‌లోని పైలాన్ వద్ద అరుణ పతాకాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు.