• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సిద్దేశ్వర స్వామికి రుద్ర కవచాన్ని అందజేసిన మంత్రి పొన్నం

KNR: హుస్నాబాద్‌లోని సిద్దేశ్వరుని దేవాలయానికి 8 కిలోల వెండి కిరీటాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు హుస్నాబాద్‌కు పాదయాత్రగా వెళ్లి రుద్ర కవచాన్ని అందజేశారు. నియోజకవర్గ గ్రామ ప్రజలు రైతులు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ఆ యొక్క సిద్దేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు.

December 26, 2024 / 01:38 PM IST

సిద్దేశ్వర స్వామికి రుద్ర కవచాన్ని అందజేసిన మంత్రి పొన్నం

KNR: హుస్నాబాద్‌లోని సిద్దేశ్వరుని దేవాలయానికి 8 కిలోల వెండి కిరీటాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు హుస్నాబాద్‌కు పాదయాత్రగా వెళ్లి రుద్ర కవచాన్ని అందజేశారు. నియోజకవర్గ గ్రామ ప్రజలు రైతులు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ఆ యొక్క సిద్దేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు.

December 26, 2024 / 01:38 PM IST

రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు టీ షర్టుల పంపిణీ

JN: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలకు ఎంపికైన జనగామ జిల్లా క్రీడాకారులకు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ చేతుల మీదుగా టీ షర్టులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

December 26, 2024 / 01:37 PM IST

‘ఈ నెల 28న న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ’

ADB: పట్టణంలోని కొమరం భీమ్ భవన్‌లో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో జిల్లా నాయకులు సమావేశమై వీలిన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 28 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.

December 26, 2024 / 01:36 PM IST

నిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

WGL: ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మతగిలి వ్యక్తికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాల శివారులో జాతీయ రహదారిపై కడారిగూడెం గ్రామానికి చెందిన దోపతి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఇల్లంద గ్రామానికి వెళ్లి తిరిగి కడారిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.

December 26, 2024 / 01:35 PM IST

ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్‌ఎస్ నాయకురాలు

WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్‌ఎస్ నాయకురాలు పుష్పితలయ నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో కవితను కలిసి పూలబుకే అందజేసి, తూర్పు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. నగరంలో పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని కవిత ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పలువురు నాయకులున్నారు.

December 26, 2024 / 01:31 PM IST

నాగర్ కర్నూల్ ఎంపీని కలిసిన పీయూ ఉపకులపతి

NGKL: హైదరాబాదులోని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

December 26, 2024 / 01:29 PM IST

ఏపీజీబీవీను తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పు

MBNR: ఆమనగల్లు మండలంలో ఇప్పటివరకు గల ఏపీజీవీబీ పేరును 1జనవరి నుంచి నూతన సంవత్సరం నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా పేరు మార్చుతున్నట్లు మేనేజర్ తిరుపతి తెలిపారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఖాతాదారులకు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి మళ్లీ ఖాతాదారులకు యథావిధిగా ధావిధిగా సేవలు అందిస్తామన్నారు.

December 26, 2024 / 01:29 PM IST

‘బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పని చేయాలి’

WGL: జఫర్‌ గడ్ మండలంలోని కొనాయిచలం, తిడుగు గ్రామాల్లో బీజేపీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. 255వ బూత్ అధ్యక్షుడిగా కాడబోయిన శ్రీనివాస్, 256వ బూత్ సింగరపు లింగమూర్తి, 257వ బూత్ అధ్యక్షుడిగా చందా రమేశ్, 258వ బూత్ వాసం రవి ఎన్నికయ్యారు. ఈ మేరకు వారికి మండల అధ్యక్షుడు నగేశ్ గౌడ్‌నియామక పత్రాలను అందజేసి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని సూచించారు.

December 26, 2024 / 01:20 PM IST

‘బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేయాలి’

MNCL: దేశంలో జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

December 26, 2024 / 01:19 PM IST

ఎమ్మెల్యేను సన్మానించిన అంతాపూర్ గ్రామస్థులు

NZB: మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో నీటి సమస్య తీర్చినందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావును గురువారం గ్రామస్థులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువాలతో సన్మానించారు. సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేశారు. నాయకులు విఠల్, గ్రామ అధ్యక్షుడు దత్తు, మాజీ సర్పంచ్ రాజు, సంజు, బాలాజీ తదితరులున్నారు.

December 26, 2024 / 01:19 PM IST

తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన మంత్రి

BDK: దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. పనుల్లో అలసత్వం వహించవద్దన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి వెంట ఉన్నారు.

December 26, 2024 / 01:18 PM IST

నల్గొండలో సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాలు

NLG: నల్గొండలో సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఎర్రజెండాను ఆవిష్కరించారు. శ్రమజీవుల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, శ్రవణ్, పబ్బు వీరస్వామి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

December 26, 2024 / 01:14 PM IST

దామరచర్లలో సీపీఐ జెండా ఆవిష్కరణ

NLG: భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శత ఉత్సవాలను జయప్రదం చేయాలని గురువారం దామరచర్ల కేంద్రంలోని సీపీఐ జెండాను నాయకులు కార్యకర్తలతో కలిసి మండల కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్ ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రముఖులు బంటు వెంకటేశ్వర్లు, ఎండి సయ్యద్, డాక్టర్ వెంకన్న, వలపట్ల వెంకన్న, తదితరులున్నారు.

December 26, 2024 / 01:14 PM IST

‘ధ్వంసమైన రోడ్డును మరమ్మత్తులు చేసి ప్రాణాలు కాపాడాలి’

ఖమ్మం: ఖమ్మం-ఇల్లందు రూట్లో పాత లింగాల క్రాస్ రోడ్డు నుండి మర్రిగూడెం గ్రామ వరకు ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వి రాకేష్ ప్రభుత్వాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులను గురువారం డిమాండ్‌ చేశారు. అనంతరం మాస్ లైన్ ఆధ్వర్యంలో మర్రిగూడెం ప్రాంతంలో రాస్తారోకో చేపట్టారు.

December 26, 2024 / 01:13 PM IST