KMM: చంద్రుగొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. సీసీ రోడ్ల శంకుస్థాపనలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు అన్నారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
SDPT: BRS రాష్ట్ర నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
NLG: చందంపేట మండలం ముడుదండ్ల గ్రామానికి చెందిన పందిరి జనార్ధన్ రెడ్డి మృతి బాధాకరమని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ముడుదండ్ల గ్రామంలో జనార్ధన్ రెడ్డి మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.
NLG: నల్గొండ మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈ నెల 28 తేదీన మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

MHBD: క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలిసులు అనుమానిస్తున్న ఘటన తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న చెప్పుల ఆధారంగా బాధితుడు అమ్మాపురం గ్రామానికి చెందిన హరీశ్(17)గా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ADB: దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ క్షేత్రంలో రాష్ట్ర టీపీసీఎఫ్, కాంపా ఉన్నతాధికారి సునీత పర్యటించారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఆమె తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఉన్నారు.
KMM: సీపీఐ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని జానంపేటలో సీపీఐ శ్రేణులు జరుపుకున్నాయి. నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య పార్టీ సీనియర్ నాయకులు పాకలపాటి చందు, తోగటి వీరభద్ర చారి మాట్లాడుతూ.. ఇప్పటికీ, ఎప్పటికీ పేదల పక్షాన వెన్నుదన్నుగా పోరాడేది తామేనన్నారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏ అధికారి, నాయకునికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా 8096107107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆయన అన్నారు.

KNR: హుస్నాబాద్‌లోని సిద్దేశ్వరుని దేవాలయానికి 8 కిలోల వెండి కిరీటాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు హుస్నాబాద్‌కు పాదయాత్రగా వెళ్లి రుద్ర కవచాన్ని అందజేశారు. నియోజకవర్గ గ్రామ ప్రజలు రైతులు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ఆ యొక్క సిద్దేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు.

JN: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలకు ఎంపికైన జనగామ జిల్లా క్రీడాకారులకు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ చేతుల మీదుగా టీ షర్టులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ADB: పట్టణంలోని కొమరం భీమ్ భవన్‌లో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో జిల్లా నాయకులు సమావేశమై వీలిన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ.. డిసెంబర్ 28 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.