ADB: దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ క్షేత్రంలో రాష్ట్ర టీపీసీఎఫ్, కాంపా ఉన్నతాధికారి సునీత పర్యటించారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఆమె తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఉన్నారు.