• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అణగారిన వర్గాల కోసం పోరాడేది సీపీఐ పార్టీ: ఎమ్మెల్యే

KMM: ఖమ్మం పట్టణంలో గురువారం సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అణగారిన వర్గాల కోసం నిర్విరామంగా పోరాడేది సీపీఐ మాత్రమే అని ఎమ్మెల్యే తెలిపారు. నిజాం పాలించిన సమయంలోనే మూడు గ్రామాలకు స్వాతంత్య్రం రావడానికి ఎర్రదండు కృషి చేసిందన్నారు.

December 26, 2024 / 12:57 PM IST

‘పొలాలకు సాగునీరు అందేలా కృషి’

ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ఆయకట్టులోని ప్రతి చేనుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. యాసంగి సీజన్‌లో రైతుల పొలాలకు సాగునీటిని అందజేసే విషయమై గురువారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇరిగేషన్ అధికారులు, పీఏసీఎస్ ఛైర్మన్లు, రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి పొలానికి నీటిని అందిస్తామని ఆయన తెలిపారు.

December 26, 2024 / 12:56 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నమూనాకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

BDK: దమ్మపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అర్హులందిరికీ ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

December 26, 2024 / 12:46 PM IST

అండగా ఉంటాం: బహదూర్‌పుర MLA

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అన్ని కుల, మతాల వారికి అండగా ఉంటుందని బహదూర్ పూర ఎమ్మెల్యే మహమ్మద్ మోబిన్ అన్నారు. నియోజకవర్గంలోని చర్చిల అభివృద్ధి కోసం ఒక్క చర్చికు రూ. లక్ష చొప్పున నాలుగు చర్చిల అభివృద్ధికి రూ. 4 లక్షల విలువైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

December 26, 2024 / 12:41 PM IST

‘సంఘం అభివృద్ధికి సహకరించాలని గజేందర్‌కు వినతి’

ADB: బోథ్ మండలంలోని కౌట(బి) గ్రామస్తులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ ఆడే గజేందర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. రెడ్డి సంఘ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వారు విన్నవించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతారెడ్డి, మండల నాయకులు తదితరులున్నారు.

December 26, 2024 / 12:40 PM IST

వేం నరేందర్ రెడ్డిని కలిసిన వినయ్ రెడ్డి

NZB: ప్రభుత్వ సలహాదారుడు ( ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంబంధర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

December 26, 2024 / 12:36 PM IST

చేనేత ఐక్య వేదిక జిల్లా కార్యదర్శిగా సంతోష్ కుమార్

SDPT: తెలంగాణ చేనేత ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా రచ్చ సంతోష్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీర మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతి చైతన్యం కోసం చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఐక్యవేదిక నాయకులకు కృతజ్ఞతలు చెపారు.

December 26, 2024 / 12:32 PM IST

సీఎం కప్ పోటీలకు వేదాంశ్ ఎంపిక

NZB: వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి వేదాంశ్ రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేశ్ తెలిపారు. ఈ నెల 27, 28, 29న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.

December 26, 2024 / 12:32 PM IST

షేక్ పేట్‌లో కార్పొరేటర్ పర్యటన

హైదరాబాద్: షేక్ పేట్ పరిధిలోని అల్ హమ్రా కాలనీలో ఈరోజు స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వారు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీశారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. షేక్ పేట్ డివిజన్లో అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

December 26, 2024 / 12:31 PM IST

దేవరకొండలో అంబేద్కర్‌ విగ్రహనికి వినతి పత్రం

NLG: దేవరకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేయడానికి ఇద్దరి పిల్లల నిబంధనను ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గురువారం వినతిపత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తక్షణమే సవరించాలన్నారు.

December 26, 2024 / 12:29 PM IST

మాసబ్ ట్యాంక్ PSలో ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్, BRS రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ వ్యవహారం హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. దళిత బహుజన వర్గాల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు శ్రీనివాస్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అతన్ని మసబ్ ట్యాంక్ పీఎస్‌కి తీసుకెళ్లారు.

December 26, 2024 / 12:28 PM IST

‘పార్టీ బలోపేతం కోసం బూత్ కమిటీలు’

KMR: పార్టీ బలోపేతం కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. కామారెడ్డిలోని గూడెం గ్రామంలో బూత్ కమిటీ అధ్యక్షుడిగా జీవన్ గౌడ్‌ను నియమించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు.

December 26, 2024 / 12:20 PM IST

రామాయంపేటలో కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి

MDK: రామాయంపేటలో గురువారం కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కేవల్ కిషన్ 63వ వర్ధంతి సందర్భంగా స్థానిక మెదక్ చౌరస్తాలో సీపీఎం నాయకురాలు బలమని ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదల భూమి కోసం పోరాడిన నాయకుడు కేవల్ కిషన్ అని ఆమె అన్నారు.

December 26, 2024 / 12:20 PM IST

4, 5 తేదీలలో బర్డ్ వాక్

నిర్మల్: జన్నారం మండలంలోని వివిధ అటవీ క్షేత్రాలలో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని జన్నారం అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని జన్నారం, ఇందనపల్లి అటవీ రేంజ్ పరిధిలో జనవరి 4, 5 తేదీలలో బర్డ్ వాక్‌ను మరోమారు నిర్వహిస్తామన్నారు. ఇందులో పాల్గొనేవాలనుకునే వారు రూ. రెండు వేల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

December 26, 2024 / 12:19 PM IST

ఎంపీ మల్లు రవిని కలిసిన పీయూ ఉపకులపతి

MBNR: హైదరాబాదులోని ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

December 26, 2024 / 12:19 PM IST