SRPT: ఈ నెల 28న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని AIKMS జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ కోరారు. గురువారం నాగారం మండల కేంద్రంలో సభ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 2013లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూడెమోక్రసీ పార్టీలు నేడు విలీనం అవ్వాలనుకోవడం శుభ పరిణామం అన్నారు.
నిర్మల్: కుంటాల మండలం ఓలా గ్రామంలో బీజేపీ బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 56వ బూత్ అధ్యక్షుడు ప్రవీణ్, 57 బూత్ అధ్యక్షుడుగా కిషన్, 58 బూత్ అధ్యక్షుడుగా సాయికుమార్‌లను ఎన్నుకున్నారు. బూత్ కమిటీల ద్వారానే పార్టీ బలోపేతం అవుతుంది. అన్ని కార్యక్రమాలు బూత్ ద్వారా కిందిస్థాయి ప్రజలకు చేరతాయన్నారు. అశోక్, సాయి పాల్గొన్నారు.
NLG: గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లకు నిధులు మంజూరు చేయాలని, నిర్మల నుంచి శేరిగూడెం రోడ్డు బాగు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సీపీఎం నాయకులు, గ్రామస్తులతో కలిసి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు బాగా లేకపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
JGL: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ నిధుల ద్వారా రూ. 7 లక్షల రూపాయలు గతంలో మంజూరు అయ్యాయి. ఆ స్కూల్ భవన నిర్మాణకి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట సంజయ్ గురువారం భూమి పూజ చేశారు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
MDK: అంబేడ్కర్‌ను గౌరవించాల్సిన కేంద్ర మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని మాల మహానాడు రాయికోడ్ మండల అధ్యక్షుడు దుర్గారామ్ అన్నారు. గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు.
SRD: తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలోని క్రీడా ప్రాంగణం అభివృద్ధికి నిధులు కేటాయించబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. శరవేగంగా విస్తరిస్తున్న ముత్తంగి గ్రామ పరిధిలో క్రీడా ప్రాంగణం ఎంతో ప్రాధాన్యతమైనదిగా తెలిపారు.
కొత్తగూడెం: జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి దమ్మపేట మండలంలో గురువారం పర్యటించారు. నాచారం గ్రామంలో రూ. 20 లక్షల, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు.
NLG: జిల్లాలో వెల్లుల్లి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 15 రోజుల కింద రూ. 350 ఉండగా, ప్రస్తుతం రూ. 450 దాటింది. NLG ప్రకాశం బజార్‌లో వెల్లుల్లి రూ. 450లకు విక్రయిస్తుడటంతో పేద, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు వెల్లుల్లి మరింత ఘాటెక్కిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
ASF: సమగ్ర శిక్ష ఉద్యోగులు, సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైద్య శాంతి కుమారి, కాంపెల్లి ఉషన్న డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
HNK: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని హనుమకొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నేడు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు వేం నరేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాలకి గుర్తుగా వ్యక్తి గతంగా కలిసి శుభాకాంక్షలు అభినందనలు తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంచు వేణు తెలిపారు.
MHBD: జిల్లా కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నేడు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన గురుస్వాముల ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, ప్రసాదం అందజేశారు.
MBNR: దుద్యాల మండల కేంద్రంలో గురువారం పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 11న అధికారులపై దాడి జరగడం, ఇటీవల నిందితులు జైల్లో నుంచి విడుదల కావడం వంటి నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు.
WGL: నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతోంది. 7, 8వ వార్డుల్లో చేపడుతున్న సర్వేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నేతలు సందర్శించి సర్వే అధికారులతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఉపసర్పంచ్ రమేశ్, పలువురు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
WNP: సీపీఐ వందేళ్ల ఉత్సవాలను గురువారం ఆత్మకూరు మండలం మూలమల్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శి మోష పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, రైతుల సమస్యలపై పోరాడటం, వారి హక్కులను కాపాడటం పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.