• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జీపీ కార్యాలయం ప్రారంభించిన పొంగులేటి

కొత్తగూడెం: జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి దమ్మపేట మండలంలో గురువారం పర్యటించారు. నాచారం గ్రామంలో రూ. 20 లక్షల, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు. 

December 26, 2024 / 11:43 AM IST

నల్గొండ ప్రకాశం బజార్‌లో వెల్లుల్లి కిలో రూ.450

NLG: జిల్లాలో వెల్లుల్లి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 15 రోజుల కింద రూ. 350 ఉండగా, ప్రస్తుతం రూ. 450 దాటింది. NLG ప్రకాశం బజార్‌లో వెల్లుల్లి రూ. 450లకు విక్రయిస్తుడటంతో పేద, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు వెల్లుల్లి మరింత ఘాటెక్కిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.

December 26, 2024 / 11:31 AM IST

‘ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి’

ASF: సమగ్ర శిక్ష ఉద్యోగులు, సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైద్య శాంతి కుమారి, కాంపెల్లి ఉషన్న డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

December 26, 2024 / 11:28 AM IST

ప్రేమ్ నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

HNK: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని హనుమకొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నేడు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు వేం నరేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాలకి గుర్తుగా వ్యక్తి గతంగా కలిసి శుభాకాంక్షలు అభినందనలు తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంచు వేణు తెలిపారు.

December 26, 2024 / 11:26 AM IST

అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మురళి నాయక్

MHBD: జిల్లా కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నేడు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన గురుస్వాముల ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.

December 26, 2024 / 11:18 AM IST

ధర్మపురి నరసింహుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, ప్రసాదం అందజేశారు.

December 26, 2024 / 11:16 AM IST

పోలీస్ స్టేషన్ ప్రారంభం.. భారీగా మోహరించిన పోలీసులు

MBNR: దుద్యాల మండల కేంద్రంలో గురువారం పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 11న అధికారులపై దాడి జరగడం, ఇటీవల నిందితులు జైల్లో నుంచి విడుదల కావడం వంటి నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు.

December 26, 2024 / 11:14 AM IST

నారక్కపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే

WGL: నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతోంది. 7, 8వ వార్డుల్లో చేపడుతున్న సర్వేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నేతలు సందర్శించి సర్వే అధికారులతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఉపసర్పంచ్ రమేశ్, పలువురు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

December 26, 2024 / 11:12 AM IST

ఆత్మకూర్‌లో ఘనంగా సీపీఐ వందేళ్ల ఉత్సవాలు

WNP: సీపీఐ వందేళ్ల ఉత్సవాలను గురువారం ఆత్మకూరు మండలం మూలమల్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శి మోష పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, రైతుల సమస్యలపై పోరాడటం, వారి హక్కులను కాపాడటం పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

December 26, 2024 / 11:06 AM IST

కొల్చారం చెరువులో లభ్యమైన ఎస్సై మృతదేహం

మెదక్: కొల్చారం చెరువులో ఒకరి మృతదేహం లభ్యమైన ఘటన నేడు వెలుగు చూసింది. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం పట్టణానికి చెందిన సాయికుమార్ బిక్కనూరులో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయారు. గురువారం కొల్చారం చెరువులో అనుమానస్పదంగా స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 10:59 AM IST

కలకలం రేపిన నవజాత శిశువు మృతదేహం

NRML: మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్ పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కవర్ కింద పడిపోగా అందులో నుండి నవజాత శిశువు మృతదేహం లభ్యం అయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2024 / 10:54 AM IST

పోతిరెడ్డి పల్లెలో ఘనంగా సీపీఐ వేడుకలు

MDK: పోతిరెడ్డిపల్లెలో గురువారం ఘనంగా సీపీఐ నాయకులు వేడుకలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా కార్యకర్తలు కార్యాలయాన్ని ఎర్ర తోరణాలతో అలంకరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ కార్యవర్గ సభ్యుడు అందె అశోక్‌ని ఘనంగా సన్మానించారు.

December 26, 2024 / 10:52 AM IST

పోలీసుల మృతిపై SP సింధు శర్మ వివరణ

KMR: అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూర్ SI సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ డెడ్ బాడీలను పోలీసులు చెరువులోంచి వెలికి తీశారు. బుధవారం నుంచి వారు కనిపించకపోవడంతో ఫోన్స్ ట్రాక్ చేసి ఘటనా స్థలాన్ని కనిపెట్టినట్లు SP సింధు శర్మ తెలిపారు. నేటి ఉదయం SI మృతదేహాం లభ్యమైందన్నారు. మృతికి గల కారణాలు వెల్లడిస్తామన్నారు.

December 26, 2024 / 10:39 AM IST

రేపు స్టేషన్ ఘన్‌పూర్ మార్కెట్ ప్రారంభం

JN: స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ శుక్రవారం పున:ప్రారంభం కానున్నట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ లావణ్య తెలిపారు. నిన్న 25న క్రిస్మస్ పండుగ సందర్బంగా నేడు బాక్సింగ్ డే సందర్భంగా మార్కెట్ బంద్ ఉండగా.. రేపు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి విక్రయించాలని కోరారు.

December 26, 2024 / 10:38 AM IST

ప్రహారీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

GDL: గద్వాల పురపాలక పరిధిలోని 24వ వార్డు శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రహారీ నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. ప్రహారీ నిర్మాణానికి రూ. 5 లక్షల నిధులు మంజూరైనట్లు వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు, వార్డు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

December 26, 2024 / 10:36 AM IST