ABD: సింగరేణి సంస్థ బొగ్గును తీసి సిల్ట్ ప్రాజెక్టులోకి వదలడం వల్ల కెనాల్‌లోకి సిల్ట్ చేరి జామ్ అవుతోందని, దీంతో నీరు రాక తీవ్రంగా ఇబ్బంది పడాల్సివస్తోందని రెబ్బెన మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కెనాల్స్‌కు మరమ్మతులు చేపించి తమను ఆదుకోవాలని కోరారు.
KMR: భిక్కనూర్ SI సాయికుమార్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికితీశారు. బుధవారం నుంచి SIతోపాటు బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేటసహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ కనిపించకపోవడంతో పోలీసులుగాలింపు చర్యలు చేపట్టారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమైనకొన్నిగంటలతర్వాత SI మృతదేహాన్ని పోలీసులు కనిపెట్టారు.
SRCL: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వాసిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికంగా ఉన్న కవ్వాల్ అభయారణ్యం అటవీ శాస్త్ర పరిశోధనకు, పరిశీలనకు, శిక్షణకు వేదికగా మారింది. అభయారణ్యంలో వన్య, పక్షి, జీవజాలాలు ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకునేందుకు అటవీ అధికారులు, సిబ్బంది, స్కాలర్స్ నిత్యం అభయారణ్యంలో పర్యటిస్తున్నారు. అభయారణ్యంలో అనేక జీవజాలాలు ఉన్నాయని, వాటిపై పరిశోధనలు చేస్తామని వారు తెలిపారు.
కొత్తగూడెం: భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ ఆఫీస్ ముందు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన ఇంత వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MDK: కొల్చారం మండలం కిష్టాపూర్ బస్టాండ్ సమీపంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్బంగా ఏడుపాయల నుంచి మెదక్ వరకు నిన్న పెద్ద మొత్తంలో రౌండ్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామానికి చెందిన అక్కం నవీన్, ప్రశాంత్ వాటిని తొలగిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
సిద్దిపేట: హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ముచ్చటిస్తూ, ప్రధాన రోడ్డు పనులు, నాళా పనులు పరిశీలించారు. అనంతరం పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
మంచిర్యాల: బెల్లంపల్లిలోని కాల్ టెక్స్ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని యువకుడి మృతదేహాం లభ్యమైనట్లు రైల్వే ASI మోహన్ రాథోడ్ తెలిపారు. వారికి అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడు రడగంబాల బస్తికి చెందిన యువకుడిగా గుర్తించారు. సుమారు 23 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
NZB: చందూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే 30 పడకల ఆసుపత్రికి నేడు వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అగ్రో ఇండస్ట్రియల్ ఛైర్మన్ గారు కాసుల బాలరాజు భూమి పూజ చేయనున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. కావున పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
WGL: ఏటూరునాగారం ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి(ఏపీవో జనరల్) కనక బీంరావు కన్నుమూశారు. ఐటీడీఏ కార్యాలయంలో ఏపీవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన భీంరావ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తోటి ఉద్యోగులు తెలిపారు. గతరాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఏపీవో బాంబర మండలం వాంకిడీలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
WGL: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో నేడు రౌడీ షీటర్లకు సీఐ సత్యనారాయణ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ జా ఆదేశం మేరకు రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హాజరు తీసుకోవడంతోపాటు పేరుపేరునా వారి వ్యక్తిగత వివరాలను వివరిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
BDK: కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు పెద్దమ్మ తల్లి సన్నిధిలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మణుగూరు నూతన డివిజన్ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఈసం సూరి బాబు, ప్రధాన కార్యదర్శి తుర్రం రవి కుమార్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
KMM: కామేపల్లి మండలం పొన్నెకల్లు, బండిపాడు, రాయిగూడెం, రుక్కితండా గ్రామాల రైతులు వ్యవసాయ విద్యుత్ బిల్లులను బుధవారం ఒకేరోజు చెల్లించి ఆదర్శంగా నిలిచారు. 245 మోటార్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులను 360 చొప్పున రూ. 1,35,000 చెల్లించారు. మిగతా గ్రామాల రైతులు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు.
NLG: జిల్లాలో రబీలో వరి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో రైతులు వరిపంటవైపు అధికంగా మొగ్గుచూపారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఇప్పటికే రైతులు సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఈ సీజన్‌లో నెలాఖరు వరకు మరో రూ. 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.