WGL: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో నేడు రౌడీ షీటర్లకు సీఐ సత్యనారాయణ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ జా ఆదేశం మేరకు రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హాజరు తీసుకోవడంతోపాటు పేరుపేరునా వారి వ్యక్తిగత వివరాలను వివరిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
BDK: కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు పెద్దమ్మ తల్లి సన్నిధిలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మణుగూరు నూతన డివిజన్ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఈసం సూరి బాబు, ప్రధాన కార్యదర్శి తుర్రం రవి కుమార్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
KMM: కామేపల్లి మండలం పొన్నెకల్లు, బండిపాడు, రాయిగూడెం, రుక్కితండా గ్రామాల రైతులు వ్యవసాయ విద్యుత్ బిల్లులను బుధవారం ఒకేరోజు చెల్లించి ఆదర్శంగా నిలిచారు. 245 మోటార్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులను 360 చొప్పున రూ. 1,35,000 చెల్లించారు. మిగతా గ్రామాల రైతులు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు.
NLG: జిల్లాలో రబీలో వరి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో రైతులు వరిపంటవైపు అధికంగా మొగ్గుచూపారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఇప్పటికే రైతులు సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఈ సీజన్‌లో నెలాఖరు వరకు మరో రూ. 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.
NZB: నవీపేట మండలంలోని పొతంగల్ రాళ్ల చెరువులో భారీ చేప లభ్యమైంది. చేపలు పట్టడానికి వెళ్లిన మత్సకారుడు హన్మాండ్లుకు సుమారు 20కిలోల బరువైన చేప దొరికింది. గాస్కర్ రకానికి చెందిన చేపగా గుర్తించారు. కాగా దాన్ని నిజామాబాద్‌కు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు హన్మాండ్లు తెలిపారు.
SRD: నర్సాపూర్ నియోజకవర్గ హత్నూర మండల పరిధిలోని హత్నూర, రొయ్యపల్లి, షేర్ఖాన్‌పల్లి, నాగారం తదితర గ్రామాలలో గురువారం ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం 21.3 ఉష్ణోగ్రత నమోదయింది.. గాలిలో తేమశాతం 96.7% ఉంది. వాతావరణం పొడిగా ఉంది. పలు ప్రాంతాలలో ఉదయం వేళలో చిరుజల్లులు పడ్డాయి.
MDK: జిల్లా పొలంపల్లి వద్ద కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి, జాతర వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దున్నేవాడిదే భూమి నినాదంతో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు.1960, డిసెంబర్ 26న మాసాయిపేటలో జరిగిన భూ పోరాటంలో పాల్గొని మెదక్ వెళుతుండగా చేగుంట సమీపంలోని పొలంపల్లి రోడ్డు వద్ద హత్యకు గురయ్యారు.
NLG: తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రాంతాలను యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో NLG జిల్లా కేంద్రంలోని ఛాయాసోమేశ్వరస్వామి ఆలయానికి స్థానం దక్కింది. ఇటీవల జరిగిన శాసన మండలి, అసెంబ్లీ సమావేశాల వేదికగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపాదనలు ఆమోదం పొందితే దేశ సంపదగా ఘనకీర్తి దక్కనుంది.

BNR: శ్రీ బాలకృష్ణ గురు స్వామి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోమహా పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు 6,900 కి.మీ పాదయాత్ర చేస్తూ బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి గోమాతతో చేరుకున్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఘనంగా బాలకృష్ణ గురుస్వామికి స్వాగతం పలికారు.

హైదరాబాద్: మాజీ సీఎం KCR, మాజీ మంత్రులు KTR, హరీశ్‌రావు పాస్ పోర్టులు సీజ్ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. పదేళ్ల KCR పాలనలో విధ్వంసం చేసి, ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు BRS వాళ్లు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కొత్తగూడెం: భద్రాద్రి సీతా రాముల ఆలయంలో హుండీల్లో భక్తులు వేసిన కానుకలను ఈనెల 30న లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి తెలిపారు. తొలుత ఈనెల 26న హుండీ లెక్కింపు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తరువాత ఈనెల 30కు లెక్కింపు కార్యక్రమాన్ని మార్చినట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు ఆలయ మండపంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు.