SRD: పటాన్‌చెరు భవిష్యనిధి సమస్యల పరిష్కారానికి నిధి ఆప్కే సంఘటన్ 2.0 కార్యక్రమంలో భాగంగా రేపు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు రామచంద్రపురం బిహెచ్ఈఎల్ ప్రధాన గేటు, మెదక్ జిల్లా నర్సాపురం మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ బలబాగ్ వద్ద మూడు కేంద్రాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలంలో మొత్తం 12.68 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వగా 29.28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో 6,08,480 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం దిగుబడి కాగా, దొడ్డు ధాన్యం 13,20,431 మెట్రిక్ టన్నులు సాగైంది. ప్రభుత్వం 13,08,000 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసింది.

ఖమ్మం: జిల్లాకు చెందిన వీఆర్వోలు బుధవారం ఖమ్మంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వీఆర్వోల రాష్ట్ర అధ్యక్షుడు గరికే పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వీఆర్ఎలను రెవిన్యూలోకి ఆప్షన్ పద్ధతిలో తీసుకుంటూ నిర్ణయించడం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు.

NZB: భీమగల్ మండలంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. పల్లికొండకు చెందిన కొండూరు బాలయ్య TVS XLపై లింబాద్రి గుట్ట నుంచి పల్లికొండ వెళ్తున్నాడు.ఈ క్రమంలో పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగావస్తున్నTATA ACE ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని కన్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద వర్ధన్ ఖోఖోలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. నిర్మల్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9 తరగతి చదువుతున్నాడు. గత నెలలో ఉట్నూరులో నిర్వహించిన జోనల్ స్థాయి ఖోఖో పోటీల్లో నిర్మల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణ తెలిపాడు.

మహబూబ్ నగర్: దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఏంఎన్ఎస్ ఆధ్వర్యంలో మను ధర్మశాస్త్రం పత్రాలను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదని, కుల వివక్షను రూపుమాపేందుకు కృషి చేశారని అన్నారు.

నారాయణపేట: జిల్లా కేంద్రానికి తాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్ లీకేజీ పనులు సింగారం చౌరస్తాలో వేగంగా కొనసాగుతున్నాయని, పనులను ఇంజనీర్ పర్యవేక్షణ చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ సునీత బుధవారం తెలిపారు. గురువారం నుంచి మరో మూడు రోజులు పట్టణానికి తాగునీరు అందించలేమని చెప్పారు. పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు పని చేస్తున్నారని అన్నారు.

MBNR: సౌత్ జోన్ టోర్నీలో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎంపికైన ఖో-ఖో పురుషుల జట్టుకు ట్రాక్ షూట్, యూనిఫామ్స్ అందజేశారు. ఈ నెల 27 నుంచి సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులోని టోర్నీలో పాల్గొననున్నట్లు తెలిపారు.