నారాయణపేట: జిల్లా కేంద్రానికి తాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్ లీకేజీ పనులు సింగారం చౌరస్తాలో వేగంగా కొనసాగుతున్నాయని, పనులను ఇంజనీర్ పర్యవేక్షణ చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ సునీత బుధవారం తెలిపారు. గురువారం నుంచి మరో మూడు రోజులు పట్టణానికి తాగునీరు అందించలేమని చెప్పారు. పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు పని చేస్తున్నారని అన్నారు.