NZB: భీమగల్ మండలంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. పల్లికొండకు చెందిన కొండూరు బాలయ్య TVS XLపై లింబాద్రి గుట్ట నుంచి పల్లికొండ వెళ్తున్నాడు.ఈ క్రమంలో పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగావస్తున్నTATA ACE ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.