NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలంలో మొత్తం 12.68 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వగా 29.28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో 6,08,480 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం దిగుబడి కాగా, దొడ్డు ధాన్యం 13,20,431 మెట్రిక్ టన్నులు సాగైంది. ప్రభుత్వం 13,08,000 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసింది.