BNR: శ్రీ బాలకృష్ణ గురు స్వామి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోమహా పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు 6,900 కి.మీ పాదయాత్ర చేస్తూ బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి గోమాతతో చేరుకున్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఘనంగా బాలకృష్ణ గురుస్వామికి స్వాగతం పలికారు.