KMM: ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డ్, ఫ్రీడమ్ పార్క్ నందు గురువారం అమృత్ మిత్ర వాటర్ ఫర్ ఉమెన్ కార్యక్రమం నిర్వహించారు. SSG సంఘం సభ్యులకు రెండు సంవత్సరాల పాటు పార్క్ వంటి ప్రాంతాల్లో మొక్కల సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయా సంఘ సభ్యులకు మేయర్ పునుకొల్లు నీరజ నోట్ పుస్తకం, చేతి సంచి, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు.