NDL: నంది కోట్కూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా వీరం ప్రసాద రెడ్డి, డైరెక్టర్గా మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి, శాలువతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింహా రెడ్డి, జయ సూర్య తదితరులు పాల్గొన్నారు.