ASR: యోగాసనాల వల్ల విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి అన్నారు. గురువారం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా గురించి కళాశాలలో అవగాహన కల్పించారు. కళాశాలలో యోగాపై వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.