NRML: నిర్మల్ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లను సుందరీకరించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని ఆమె సూచించారు. జూన్ 30లోపు గృహ, వాణిజ్య పన్నుల వసూలును 100% పూర్తి చేయాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు.